ఆరేళ్లపాటు మంచం పట్టిన భర్తను భార్య సపర్యలు.. పూర్తిగా కోలుకున్నాక విడాకులు ఇచ్చిన భర్త..

ఆరేళ్లపాటు మంచం పట్టిన భర్తను భార్య సపర్యలు..  పూర్తిగా కోలుకున్నాక విడాకులు ఇచ్చిన భర్త..

Malaysian woman | మంచాన పడి అచేతనంగా తన భర్తను ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంది. నెలలు కాదు.. ఏడాది కాదు.. ఏకంగా ఆరేళ్ల పాటు త‌న జీవితాన్ని పూర్తి గా భ‌ర్త‌కు స‌ప‌ర్య‌లు చేసేందుకే అంకితం చేసింది ఈ మలేషియా మహిళ. అయితే చివ‌ర‌కు ఆ భ‌ర్త పూర్తిగా కోలుకున్నాక అప్పటి వ‌ర‌కు అన్నీతానై సేవ‌లు చేసిన భార్యకు విడాకులిచ్చాడు. తిరిగి వెంట‌నే అతను మ‌రో మ‌హిళ‌ను వివాహం చేసుకున్నాడు. ఈ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న ఇటీవ‌ల చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే.. 2016లో నూరుల్ సియాజ్వానీ (Nurul Syazwani) అనే మహిళలకు వివాహం జరిగింది. వివాహమైన రెండేళ్లకే ఆమె భర్త కారు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అతను ఆరేళ్లపాటు అచేతనంగా మంచానికే పరిమితమయ్యాడు. సియాజ్వానీ త‌న భ‌ర్త‌కు నాసోగ్యాస్ట్రిక్ ట్యూబ్ ద్వారా అతనికి ఆహారం ఇవ్వడం, డైపర్లు మార్చడం, స్నానం చేయడం వంటి రోజువారీ పనులను చేసింది. ప్ర‌తీ క‌ష్టంలోనూ తోడుగా నిలిచింది.

READ MORE  Bengaluru | వేడి దోస స‌ర్వ్ చేయని హోటల్ కు షాక్.. రూ.7000 జ‌రిమానా..

ఆమె అంకితభావంతో త‌న భ‌ర్తను మాములు మ‌నిషిగా తీర్చిదిద్దింది. అయితే క‌నిక‌రం లేని భ‌ర్త ఆమెకు విడాకులు ఇచ్చాడు. విడిపోయిన ఒక వారం తర్వాత మరొక మ‌హిళ‌ను తిరిగి వివాహం చేసుకున్నాడు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ద్వారా తెలుసుకున్న నెటిజ‌న్లు సియాజ్వానీ భ‌ర్త‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. అతనిని ‘కృతజ్ఞత లేని హృదయం లేనివాడు విమర్శల దాడి చేస్తున్నారు.

2019లో, సియాజ్వానీ తన రోజువారీ జీవితాన్ని సోషల్ మీడియాలో డాక్యుమెంట్ చేయడం ప్రారంభించింది. భ‌ర్త‌కు ఆమె చేస్తున్న స‌ప‌ర్య‌ల‌కు ఎంతో మంది నెటిజన్లు క‌రిగిపోయారు. సోష‌ల్ మీడియాలో 32,000 మంది ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంది. మొద‌ట్లో ఆమె ప‌డిన క‌ష్టాల‌ను, భయాలను, ఆమె చేసిన రోజువారీ పనుల‌ను త‌న వీడియోల్లో వివరించింది.
సియాజ్వానీ తన మాజీ భర్తను దయతో క్ష‌మించేసింది. అయితే ఆమె కథ వైరల్‌గా మారింది, చాలా మంది ఆమె మాజీ భర్త చర్యలను ఖండించారు. కంటికి రెప్ప‌లా కాపాడిన భార్య ప‌ట్ల ఇలా అమానుషంగా వ్య‌వ‌హ‌రించ‌డం దారుణ‌మ‌ని ఖండిస్తున్నారు.

READ MORE  Raksha Bandhan | రాఖీ కట్టేందుకు ఆగష్టు 19న శుభముహూర్తం ఎప్పుడు!

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *