Posted in

Maharashtra Assembly polls | మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు.. మహా వికాస్ అఘాడి (MVA) కూటమి పొత్తు ఖరారు..

Maharashtra Assembly polls
Maharashtra Assembly polls
Spread the love

Maharashtra Assembly polls | మ‌హారాష్ట్ర లో అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా- కాంగ్రెస్, శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ వర్గం) మ‌ధ్య పొత్తులో భాగంగా సీట్ల పంప‌కం పూర్త‌యింది. 288 సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో ఒక్కో పార్టీ 85 స్థానాల్లో పోటీ చేయ‌నున్నారు. మిగిలిన సీట్లు MVA కూటమి భాగస్వాములు చిన్న మిత్రపక్షాల మధ్య పంపిణీ చేయన్నారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే, కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత బాలాసాహెబ్ థోరట్, ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్, ఇతర నేతలు సహా ఎంవీఏ నేతలు శరద్ పవార్‌తో సమావేశమై తుది నిర్ణయం తీసుకున్నారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. సీట్ల కేటాయింపు వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని తెలిపారు.

మూడు ప్రధాన MVA భాగస్వాములు-కాంగ్రెస్, శివసేన (UBT), NCP (SP)- 85 చొప్పున సమాన సంఖ్యలో సీట్లు కేటాయించారు. మిగిలిన 33 సీట్లు కూటమిలోని చిన్న మిత్రపక్షాలకు పంపిణీ చేయ‌నున్న‌ట్లు రౌత్ స్పష్టం చేశారు. “మేము 288 సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో 255 సీట్లను ఖరారు చేసాము, మిగిలిన 33 సీట్ల కేటాయింపు కూడా త్వరలో జరుగుతుంది. MVAలో ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. ప్రతిదీ సామరస్యంగా చ‌ర్చించుకుని తుది నిర్ణ‌యాలు తీసుకున్నామ‌ని కూటమిలోని భాగస్వామ్య పక్షాలు త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తాయని రౌత్ తెలిపారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సీట్ల షేరింగ్‌పై వివాదాల మధ్య, శివసేన (UBT) 65 సీట్లపై తన వాదనను ప్రకటించింది, కొన్ని ఇప్పటికీ వివాదాస్పదంగా ఉన్నాయి. MVA చిన్న మిత్రపక్షాలు, రైతులు, వర్కర్స్ పార్టీ (PWP) వంటివి సంగోలా వంటి కొన్ని స్థానాలను కావాల‌ని ప‌ట్టుబ‌ట్టాయి. పార్టీ జాబితాలోని వివాదాస్ప‌ద అంశాల‌ గురించి అడిగినప్పుడు, దిద్దుబాట్లు చేస్తామని రౌత్ చెప్పారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *