Maharashtra Assembly Elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ శనివారం విడుదల చేసింది. తాజా అభ్యర్థుల జాబితాతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 71 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజా జాబితాలో, డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్‌పై దక్షిణ నాగ్‌పూర్ నుంచి గిరీష్ కృష్ణరావు పాండవ్ ను కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిపింది.
పూర్తి జాబితా ఇదే..
- భుసావల్ – డాక్టర్ రాజేష్ తుకారాం మాన్వత్కర్
- జలగావ్ – డాక్టర్ స్వాతి సందీప్ వాకేకర్
- అకోట్ – మహేష్ గంగనే
- వార్ధా – శేఖర్ ప్రమోద్బాబు షెండే
- సావ్నర్ – అనూజ సునీల్ కేదార్
- నాగ్‌పూర్ సౌత్ – గిరీష్ కృష్ణరావు పాండవ్
- కమ్తి – సురేష్ యాదవ్రావ్ భోయార్
- భండారా (SC) – పూజ గణేష్ తావ్కూర్
- అర్జున్-మోర్గావ్ (SC) – దలీప్ వామన్ బన్సోడ్
- అమగావ్ (ఎస్టీ) – రాజ్‌కుమార్ లోటుజీ పురం
- రాలేగావ్ – ప్రొ. వసంత్ చిందుజీ పుర్కే
- యావత్మాల్ – అనిల్ బాలాసాహెబ్ శంకర్రావ్ మంగూల్కర్
- ఆర్ని (ఎస్టీ) – జితేంద్ర శివాజీరావు మోఘే
- ఉమర్‌ఖేడ్ (SC) – సాహెబ్రావ్ దత్తారావు కాంబ్లే
- జల్నా – కలియాస్ కిషన్‌రావ్ గోర్తంత్యాల్
- ఔరంగాబాద్ ఈస్ట్ – మధుకర్ కృష్ణారావు దేశ్‌ముఖ్
- వసాయ్ – విజయ్ గోవింద్ పాటిల్
- కండివాలి తూర్పు – కాలు బధేలియా
- చార్కోప్- యశ్వంత్ జయప్రకాష్ సింగ్
- సియోన్ కోలివాడ – గణేష్ కుమార్ యాదవ్
- శ్రీరాంపూర్ (SC) – హేమంత్ ఒగలే
- నీలంగా – అభయ్‌కుమార్ సతీష్‌రావు సాలుంఖే
- శిరోల్ – గణపతిరావు అప్పాసాహెబ్ పాటిల్
Maharashtra Assembly Elections మహా వికాస్ అఘాడిలో సీట్ల పంపకాల చర్చలు జరుగుతున్నాయని, శనివారం తుది సమావేశం జరగనుందని సమాచారం. ఇప్పటి వరకు కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్సీపీ), ఉద్ధవ్ సేనలకు 90 సీట్ల చొప్పున పంపకం జరిగింది. కాగా మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 23 (శనివారం)న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..