Mahalakshmi scheme | రాహుల్ గాంధీ రూ.లక్ష ప్రకటనతో ఖాతాలు తెరిచేందుకు పోటెత్తిన మహిళలు
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘మహాలక్ష్మి’ పథకం (Mahalakshmi scheme) కింద మహిళలకు సంవత్సరానికి రూ.1 లక్ష ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.. దీంతో పెద్ద సంఖ్యలో మహిళలు ఖాతాలు తెరిచేందుకు బెంగళూరు జనరల్ పోస్ట్ ఆఫీస్ (GPO) కు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPBP) ఖాతాలను తెరవడానికి మహిళలు తెల్లవారుజామున 3 గంటలకే వచ్చారు.
గత రెండు రోజులుగా పోస్టాఫీసు వద్ద మహిళల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. దీనికి కారణం.. ఖాతా తెరవడానికి మే 27 చివరి రోజు అని వాట్సాప్లో పుకార్లు వ్యాపించడంతో మహిళల సంఖ్య రెట్టింపయింది. ఈ తప్పుడు సమాచారం వల్ల నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు తెల్లవారక ముందే పోస్టాఫీసుకు చేరుకోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. తోపులాటలు జరగకుండా పోలీసులను రప్పించారు.
Mahalakshmi scheme కింద అయితే రూ. లక్ష జమ చేసే పథకం ఏదీ లేదని జీపీఓ అధికారులు స్పష్టం చేశారు. ఖాతా తెరిచేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేదా ప్రత్యేక చెల్లింపులు లేవని పేర్కొంటూ కార్యాలయం వెలుపల నోటీసును కూడా అంటించారు. అయితే, పోస్టాఫీసు అధికారులు ఇంత స్పష్టంగా చెప్పినా కూడా మహాలక్ష్మి పథకం పై నమ్మకంతో మహిళలు తమ ఖాతాలను తెరవాలని పట్టుబట్టారు.
టోకెన్ సిస్టమ్
కాగా ఖాతాలు తెరవడానికి, మహిళల రద్దీని క్రమబద్ధీకరించడానికి, అధికారులు టోకెన్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ, కొంతమంది వ్యక్తులు ఎక్కువ టోకెన్లను పొందడం, వాటిని డబ్బులకు విక్రయించడం ప్రారంభించారు. దీనికి అధికారులు వెంటనే తేరుకొని మహిళల ఆధార్ కార్డుల చివరి అంకెల ఆధారంగా టోకెన్లను జారీ చేయడం ప్రారంభించారు.
అదనపు సిబ్బంది నియామకం..
IPBP ఖాతాలను ఏదైనా పోస్టాఫీసులో లేదా ఆన్లైన్లో తెరవవచ్చని, ఆధార్ ధృవీకరణ కోసం లబ్ధిదారుల ఇళ్లను సందర్శించడానికి పోస్టాఫీసు సిబ్బంది అందుబాటులో ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ ఆప్షన్లు ఉన్నప్పటికీ, మెజారిటీ ప్రజలు పోస్టాఫీసుల వద్దకు రావడానికి మొగ్గు చూపుతున్నారు. ఇంత మందిని మేనేజ్ చేయడానికి అదనపు సిబ్బందిని నియమించాల్సి వచ్చింది. కాగా మంగళవారం ఒక్కరోజే వెయ్యికి పైగా ఖాతాలు తెరిచినట్లు అధికారులు తెలిపారు.
Karnataka: After Congress Prince Rahul Gandhi announced free Rs 1 lakh per year “Taka Tak, TakaTak” Guarantee scheme, women especially from special community have queued up in Bengaluru’s Post office to open India Post Payments Bank(IPBP)account from 3 amhttps://t.co/1VuvI1jTmt pic.twitter.com/9I00aIq7rS
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 29, 2024
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..