Mahalakshmi Free Bus Scheme | ఎక్స్ ప్రెస్ బస్సులు ఎక్కే మహిళలకు టీఎస్ ఆర్టీసీ కీలక సూచన
Mahalakshmi Free Bus Scheme | మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే మహిళలకు టీఎస్ ఆర్టీసీ ఒక కీలక సూచన చేసింది. తక్కువ దూరం ప్రయాణించాల్సిన మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఎక్స్ ప్రెస్ బస్సుల్లోనే వెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది.. దీనివల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్రంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఈ నేపథ్యంలో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బంది,తోటి ప్రయాణికులకు సహకరించాలని ఆయన కోరారు.
Mahalakshmi Free Bus Scheme అలాగే కొందరు మహిళలు అనుమతించిన స్టేజీ ల్లో కాకుండా మధ్యలోనే బస్సులు ఆపాలని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. దీంతో ప్రయాణ సమయం పెరిగిపోతుందని తెలిపారు. అందుకే ఇకపై ఎక్స్‌ప్రెస్ బస్సులను అనుమతించిన స్టేజీల్లో మాత్రమే ఆపుతామని వెలిపారు. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యమిచ్చి సిబ్బందికి సహకరించాలని సజ్జనార్ (ఎక్స్) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్ ప్రెస్ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు #TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి.. సిబ్బందికి… pic.twitter.com/bJryVNNxkM
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) December 23, 2023
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
పెనం మీద నుండి పొయ్యి లో పడేట్టు ఉంది, తెలంగాణ మగాళ్ల పరిస్థితి.