Wednesday, January 28"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

ఈవీఎంలను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే.. ఈసీ సీరియస్.. డీజీపీకి కీలక ఆదేశాలు

Spread the love

Macherla Assembly Constituency | ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి (Pinnelli Venkatarami Reddy) ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను (EVM) ధ్వంసం చేసిన వీడియో  ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వెబ్‌క్యామ్ ఫుటేజీలో, ఎమ్మెల్యే బలవంతంగా పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించడం, ఓటింగ్ పరికరాన్ని స్వాధీనం చేసుకుని నేలపై పడవేయడం కనిపించింది. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఈవీఎంను తొక్కుతూ దొరికిపోయారు.ఈ ఏడాది మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు ఈ వీడియో రికార్డైనట్లు సమాచారం.

Highlights

ఈ విషయాన్ని ఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం (మే 21) గుర్తించింది. దీంతో రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది.

మాచర్ల (macherla) అసెంబ్లీ నియోజకవర్గం లోని పీఎస్ నంబర్ 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటన వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి వెబ్ కెమెరాలో రికార్డయ్యిందని మీనా ఒక ప్రకటనలో తెలిపారు. “విధ్వంసక సంఘటనపై దర్యాప్తులో కోసం పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు  అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు. విచారణలో ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

“ఈసీ ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటోంది. ఈవీఎం ధ్వంసం కేసుల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈసీ పోలీసులను ఆదేశించింది.  పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు తమ విచారణకు సహకరించేందుకు ఈ ఘటనలకు సంబంధించిన ఫుటేజీని పోలీసులకు అందించారు.

మే 13న, ఆంధ్రప్రదేశ్ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఎన్నికల సందర్భంగా పలు హింసాత్మక ఘటనలుజరిగాయి. ఇదిలా ఉండగా వైఎస్సార్‌సీపీపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రామకృష్ణారెడ్డికి ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకుందని, అందుకే నిరాశతో ఈవీఎంలను ధ్వంసం చేశారని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *