l&t Metro Hyderabad | హైదరాబాద్ మెట్రోలో అసలేం జరుగుతోంది..!
1 min read

l&t Metro Hyderabad | హైదరాబాద్ మెట్రోలో అసలేం జరుగుతోంది..!

Spread the love

l&t Metro Hyderabad |  తెలంగాణలో హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్)ను నిర్వహిస్తున్న L & T  భవిష్యత్తులో ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించాలనుకుంటున్నట్లు కంపెనీ ఇటీవలే వెల్లడించింది. మహాలక్ష్మి పథకం (Mahalakshmi Shceme) కింద రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌ఆర్‌టీసీ బస్సుల్లో   మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీనివల్ల తమకు భారీగా ఆదాయం పడిపోవడంతో ప్రాజెక్ట్‌ను విక్రయించాలని భావిస్తున్నామని ఎల్‌అండ్‌టి తెలిపిన విషయం తెలిసిందే.. మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత, మెట్రో రైలులో ప్రయాణించే రోజువారీ ప్రయాణికుల సంఖ్య నవంబర్ 2023లో 550,000 నుంచి 480,000కి తగ్గింది.

ఎల్ అండ్ టీపై రేవంత్ రెడ్డి ఏమన్నారు?

గత ఏడాది మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేపట్టేందుకు ఎల్‌అండ్‌టీ నిరాకరించడంతో తెలంగాణ సీఎం అసహనం వ్యక్తం చేశారు.  కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (KLIP)లో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి కాంట్రాక్టు ఏజెన్సీగా L&T ఉన్న విషయం తెలిసిందే.. రేవంత్ రెడ్డి ఇటీవల స్పందిస్తూ.. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించాలని కోరుతున్న ఎల్‌అండ్‌టి గురించి తాను బాధపడటం లేదన్నారు. ప్రభుత్వాలు కార్పోరేట్‌ల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తాయని, ఎల్‌అండ్‌టి ఈ ప్రాజెక్టు నుంచి వైదొలగాలని భావిస్తే దానిని స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. మెట్రో రైల్‌ను నిర్వహించేందుకు రాష్ట్రానికి మరో కంపెనీ దొరుకుతుందని, తాను మెట్రో రైల్‌కు వ్యతిరేకం కాదని, ఎల్‌అండ్‌టి కాకపోతే ప్రజా రవాణా వ్యవస్థను మరొక సంస్థ ద్వారా కొనసాగించాలని తాను కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, కార్పొరేట్‌ కంపెనీల లాభార్జన తమకు అవసరం లేదన్నారు.

మహాలక్ష్మి పథకంపై విమర్శలు

వాతావరణ కాలుష్యానికి కారణమైన బస్సుల్లో ప్రయాణాన్ని ప్రోత్సహించే విధానాలను అవలంబించకుండా జీరో పొల్యూషన్ రవాణా వ్యవస్థకు ప్రభుత్వాలు మారాలని హైదరాబాద్ మెట్రో రైల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్ శంకర్ రామన్ ఇచ్చిన సలహా సిఎంను కలవరపెట్టినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో కాలుష్యం పెచ్చుమీరి అక్కడి ప్రజలు ఊపిరాకడ తల్లడిల్లిపోతున్నారు. డీజిల్, పెట్రోల్ వాహనాలకు బదులుగా అక్కడ సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలవైపు ప్రభుత్వం తోపాటు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు.

ఇదిలా ఉండగా ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా మహాలక్ష్మి పథకంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ చర్యలు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి పర్యావరణాన్ని ఎలా ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయో పట్టించుకోవడం లేదని అన్నారు.

2017 నవంబర్ 28న మియాపూర్ నుండి నాగోల్ వరకు 30 కి.మీల హైదరాబాద్ మెట్రో రైల్‌ను నరేంద్ర మోదీ ప్రారంభించారు. అప్పటి తెలంగాణ సిఎం కె చంద్రశేఖర్ రావు,  గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో కలిసి మొదటిసారి మొట్రోలో ప్రయాణించారు. హైదరాబాద్ లో  మెట్రో రైలుకు కొద్దిరోజుల్లోనే ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. డబ్బును,  సమయాన్ని ఆదా చేసుకునేందుకు ప్రజలు మెట్రోలవైపు మొగ్గుచూపారు.

ప్రస్తుతం, రాష్ట్ర ప్రభుత్వం ORR వెంట మెట్రో రైలు ప్రాజెక్టును ప్లాన్ చేస్తోంది, అలాగే ఓల్డ్ సిటీ, రాయదుర్గం నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్టివిటీని విస్తరిస్తోంది.

L&T కష్టాలు

హైదరాబాద్ మెట్రో రైలు ( HMR) తన నష్టాల గురించి గళం విప్పింది.  2021లో  HMR నష్టాలను చవిచూసిందని L&T వెల్లడించిన తర్వాత, అప్పటి సీఎం కేసీఆర్ (CM KCR) మెట్రో రైల్‌ను రక్షించే మార్గాలను అన్వేషించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. జూన్ 2023లో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలుకు రూ.100 కోట్ల వడ్డీ లేని రుణాన్ని అందించింది. కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించిన 16వ సంవత్సరంలో రుణాన్ని తిరిగి చెల్లించవలసి ఉంది. 2021-22లో 1,745 కోట్లుగా ఉన్న నష్టాలను 2022-23లో ₹ 1,315 కోట్లకు తగ్గించడానికి రుణాన్ని ఉపయోగించాల్సి ఉంది.

నివేదికల ప్రకారం, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ) సూచించిన మేరకు మేడిగడ్డ బ్యారేజీకి సొంత ఖర్చుతో మరమ్మతులు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టితో సమానంగా కఠినంగా వ్యవహరిస్తోంది. మరమ్మతులు చేపట్టకుంటే సంస్థ నుంచి మరమ్మతుల కోసం రాష్ట్రానికి అయ్యే మొత్తం ఖర్చును తిరిగి వసూలు చేయాలని రాష్ట్రం ఆలోచిస్తోంది. ఎల్‌అండ్‌టిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై మరికొద్దిరోజుల్లోనే రేవంత్‌రెడ్డి  వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *