Friday, January 23Thank you for visiting

Local

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తుది జాబితా సిద్ధం చేసిన సిక్స్ మెన్ కమిటీ

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తుది జాబితా సిద్ధం చేసిన సిక్స్ మెన్ కమిటీ

Local
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో వర్కింగ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం ఏర్పడ్డ సిక్స్ మెన్ కమిటీ సమావేశం శనివారం జరిగింది. సిక్స్ మెన్ కమిటీ కన్వీనర్ బీఆర్ లెనిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కో-కన్వీనర్లు బొక్క దయాసాగర్, వేముల నాగరాజు, సభ్యులు గడ్డం రాజిరెడ్డి, మసకపురి సుధాకర్, బొల్లారపు సదయ్యలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.సభ్యుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన కమిటీ.. తుది జాబితాను రూపొందించింది. ఐదు సంవత్సరాల కంటే తక్కువ అనుభవం ఉన్న వారి అప్లికేషన్లను రిజెక్ట్ చేసిన కమిటీ..  అనుభవం ఉన్న జర్నలిస్టుల విషయంలో మానవతా ధృక్పథంతో వ్యవహరించింది. తుది జాబితాకు సంబంధించిన భూ సేకరణ కోసం అధికారులు, ప్రజాప్రతినిధులను కలసి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని సభ్యులకు తెలియజేశారు. వివిధ చోట్ల అందుబాటులో ఉన్న ప్రభుత్వ జాగాలు చూసి ఫైనల్ చేసేందుకు మంత్రి, ఎంఎల్ఏతో కలసి ముందుకు సాగుతామని ప్రకటించింది. ...
నేతన్నకు భరోసా బీఆర్ఎస్ సర్కారు  

నేతన్నకు భరోసా బీఆర్ఎస్ సర్కారు  

Local
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్: నేతన్నలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత వారోత్సవాల్లో భాగంగా కొత్తవాడ అమరవీరుల స్థూపం నుంచి పద్మశాలి ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. అనంతరం ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో నేతన్నలు నేసిన వస్త్రాలతో ఏర్పాటు చేసిన స్టాల్ ను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నేతన్నలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని తెలిపారు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది మన బతుకులు గొప్పగా మార్చుకునేందుకేనని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధిచిన తెలంగాణలో ఆ ఫలాలను నేడు నేతన్నలకు అందుతున్నాయన్నార...
వరంగల్ లో ‘కుడా’ భూముల వేలానికి సన్నాహాలు

వరంగల్ లో ‘కుడా’ భూముల వేలానికి సన్నాహాలు

Local
వరంగల్: హన్మకొండ-ధర్మసాగర్ రహదారిలోని ఉనికిచెర్ల గ్రామ సమీపంలో తొలిదశలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లను ఆగస్టు 20న వేలం నిర్వహించేందుకు కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ( Kakatiya Urban Development Authority ) అధికారులు సన్నాహాలు చేస్తున్నారు . (ORR), సిటీ సెంటర్ నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల  దూరంలో ఉంది. కాగా KUDA యాజమాన్యంలోని మొత్తం భూమి 135 ఎకరాలు విస్తరించి ఉంది.అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ప్లాట్ల మూల ధర (అప్సెట్ ధర) చదరపు గజానికి దాదాపు రూ.12,000గా అంచనా వేసినట్లు సమాచారం. అయితే బిడ్డర్లు చదరపు గజానికి రూ. 20,000 వరకు వేలం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అందుబాటులో ఉన్న నివాస ప్లాట్లు రెండు పరిమాణాలలో వస్తాయి.. అవి 200 చదరపు గజాలు (30×60) అలాగే 300 చదరపు గజాలు (45×60). ఈ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు 'యూని' సిటీ ( ‘Uni’ City) అని పేరు పెట్టారు.“నగరానికి దగ్గ...
నిజాయితీగా వ్యాపారం చేసుకోండి లేదంటే చర్యలు తప్పవు

నిజాయితీగా వ్యాపారం చేసుకోండి లేదంటే చర్యలు తప్పవు

Local
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ. రంగనాథ్ హన్మకొండ: ‘నిజాయితీగా వ్యాపారం చేయండి లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్.. పాత ఇనుప సామాను కొనుగోలు వ్యాపారస్తులకు, ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యానికి సూచించారు.వరంగల్, హన్మొకండ, కాజీపేట ట్రై సిటీ పరిధిలోని పాత సామగ్రి కొనుగోలు చేసే వ్యాపారులతో పాటు ఆటో కన్సల్టెన్సీ నిర్వాహకులతో గురువారం హన్మకొండ భీమారంలోని శుభం కల్యాణ వేదికలో పోలీసు కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముందుగా నగరంలో చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు కలిగే నష్టంతో పాటు, తద్వారా దేశానికి ఏవిధంగా నష్టం వాటిల్లుతుందో పోలీస్ కమిషనర్ రంగనాథ్ వ్యాపారస్తులకు వివరించి చెప్పారు. కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా చోరీకి గురైన వాహనాల కొనుగోలు చేయడం సరికాదన్నారు. నిబంధనలు పాటిస్తూ వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. ము...
సైలెన్సర్లను మార్చితే మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు.. 

సైలెన్సర్లను మార్చితే మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు.. 

Local
వరంగల్ పోలీసుల హెచ్చరిక వరంగల్: ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసినా వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానిక్ లపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ భోజరాజు హెచ్చరించారు. సోమవారం హన్మకొండలోని కేయూ క్రాస్ వద్ద భారీ శబ్ధం చేసే ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోలర్ తో ధ్వంసం చేశారు. కాగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పలు ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో భారీ శబ్బాలు వచ్చేలా సైలెన్సర్లను రీప్లేస్ చేస్తున్నారు. దీనిపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వీ.విరంగనాథ్ ఆదేశాల మేరకు ఇటువంటి ఆకతాయిలపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు.ఇందులో భాగంగా కొద్ది రోజులుగా వరంగల్ ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు విరుద్ధంగా భారీ శబ్ధం వచ్చే సైలెన్సర్లు కలిగిన ద్విచక్రవాహనాలను గుర్తించి వాటి నుంచి సైలెన్సర్లను ట్రాఫిక్ ప...
భూపాలపల్లి: వరద బీభత్సానికి గల్లంతైన మహిళ.. నాలుగు రోజులకు మృతదేహం లభ్యం

భూపాలపల్లి: వరద బీభత్సానికి గల్లంతైన మహిళ.. నాలుగు రోజులకు మృతదేహం లభ్యం

Local
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం సృష్టించిన వరద బీభత్సానికి మోరంచపల్లి గ్రామానికి చెందిన గొర్రె వజ్రమ్మ (63) మహిళ గల్లంతు కాగా.. ఆమె మృతదేహాన్ని ఆదివారం రాత్రి గుర్తించినట్లు భూపాలపల్లి సీఐ రామ్ నర్సింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గురువారం మోరంచపల్లి లో నలుగురు వ్యక్తులు గల్లంతు కాగా వాగు పరిసర ప్రాంతాల్లోని ఆయా గ్రామాల యువకులు, ప్రజల సహకారంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. శనివారం రెండు మృతదేహాలు లభ్యం కాగా, ఆదివారం నేరెడుపల్లి సర్పంచ్, గ్రామస్థుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టగా.. నేరేడుపల్లి శివారు చిర్రకుంట చెట్ల పొదల్లో గొర్రె వజ్రమ్మ మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు. ఇంకా మరొక మృతదేహం కోసం గాలింపుచర్యలు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. ప్రజలకు ఎక్కడైనా మృతదేహాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని సీఐ కోరారు....
భద్రకాళి చెరువుకు గండి

భద్రకాళి చెరువుకు గండి

Local
కాలనీలోకి దూసుకువస్తున్న వరద నీరు.. అప్రమత్తమైన అధికారులు సమీప కాలనీల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు వరంగల్: వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి చెరుకువుకు గండి పడింది. ఎగువ నుంచి వరద పోటెత్తడంతో చెరువులోకి భారీగా నీరు వచ్చిచేరింది. సామర్థ్యానికి మించి వరద రావడంతో పోతన నగర్ వైపు ఉన్న చెరువు కట్ట తెగిపోయింది.. దీంతో చెరువులోని నీరంతా ఉధృతంగా బయటకు ప్రవహిస్తున్నది.. సరస్వతినగర్, పోతననగర్ తోపాటు చుట్టు ఉన్న కాలనీల వైపు వేగంగా వరద నీరు దూసుకువస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.. కాలనీ వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.. అలాగే గండి పూడ్చే పనికోసం సిబ్బందిని అక్కడికి తరలిస్తున్నారు. మరోవైపు హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సిక్తా పట్నాయక్ ప్రావిణ్య, నగర మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో ముంపు బాధితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.#Warangalrains వ...
వీడియో: వరద ప్రవాహంలో వాహనం నడిపితే ఎంతో ప్రమాదమో చూడండి..

వీడియో: వరద ప్రవాహంలో వాహనం నడిపితే ఎంతో ప్రమాదమో చూడండి..

Local
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తెలంగాణలోని అనేక ప్రాంతాల ప్రజలు వరదల్లో చిక్కుకొకని పోతున్నారు. తాజాగా హన్మకొండ జిల్లాలో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన విషాద సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. వీడియోలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నారం గ్రామానికి చెందిన పి.మహేందర్ (32)గా గుర్తించారు. వాగు నుంచి నీరు పొంగి ప్రవహిస్తున్న రోడ్డు వెంబడి నెమ్మదిగా బైక్ నడుపుతుండగా బైక్ అదుపు తప్పి ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయాడు. వేలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం మహేందర్ కొట్టుకుపోగా, సాయంత్రం ప్రమాద స్థలానికి అరకిలోమీటర్ దూరంలో మృతదేహాన్ని వెలికితీశారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా అనేక నీటి వనరులు పొంగిపొర్లుతున్నాయి, వరదలతో రహదా...
అదృశ్యమైన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి విశాఖ బీచ్‌లో శవమై కనిపించాడు

అదృశ్యమైన ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి విశాఖ బీచ్‌లో శవమై కనిపించాడు

Andhrapradesh, Local
Vishakhapatnam: గత వారం అదృశ్యమైన హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యార్థి కార్తీక్(21) మంగళవారం విశాఖపట్నంలోని బీచ్ లో శవమై కనిపించాడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ లోని వాటర్ ట్యాంక్ తండాకు చెందిన రైతు, చిరువ్యాపారి అయిన ఉమ్లా నాయక్ కుమారుడు.. కార్తీక్ ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్-మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈనెల 17న ఐఐటీ క్యాంపస్ నుంచి అదృశ్యమయ్యాడు. 17న తండ్రి ఉమ్లా నాయక్ ఫోన్ చేసినా కార్తీక్ లిఫ్ట్ చేయలేదు.అయితే అతని మృతదేహాన్ని విశాఖ బీచ్ లో గుర్తింంచారు. కాగా అతడు ఆత్మహత్య చేసుకోవడంతో మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు.అంతకుముదు కార్తీక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఐఐటీ అధికారుల నుంచి సమాచారం అందుకున్న అతని తల్లిదండ్రులు జూలై 19న ఇన్‌స్టిట్యూట్‌కు చేరుకుని సంగా...
విపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి

విపక్షాలు చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలి

Local
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ కు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నరేందర్ పిలుపువరంగల్: వరంగల్ ఓసిటీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వరంగల్ తూర్పు నియోజకవర్గ బీఆర్ఎస్ సోషల్ మీడియా ముఖ్యులతో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో చురుగ్గా పనిచేస్తూ బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న దుష్ర్పచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా వేదికగా సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని కోరారు. వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రూ.3,800 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేశామని, అటు విద్య ఇటు వైద్యంలో టాప్ లో ఉన్నామన్నారు. గత పాలకులు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా వెనుకబడేశారనేది వివరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా తాను ఈ నియోజకవర్గాన్ని ఎంత గొప్పగా అభివృద్ధి చేశారనే విషయాలపై సోషల్ మీడియా కార్యకర్తలకు ఎమ్మెల్యే వివరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి కేటీ...