LK Advani admitted to Apollo Hospital | బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ న్యూఢిల్లీ (New Delhi)లోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య నిలకడగా ఉందని ఆసుపత్రి అధికారులు ధృవీకరించారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయన్ను అబ్జర్వేషన్ లోఉంచినట్లు పేర్కొన్నారు. 96 ఏళ్ల ఎల్‌కె అద్వానీ న్యూరాలజీ విభాగంలో సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినిత్ సూరి సంరక్షణలో ఉన్నారని వార్తా సంస్థ పిటిఐ తెలిపింది రెండు రోజుల క్రితం మాజీ ఉప ప్రధానిని ఆసుపత్రికి తీసుకొచ్చారు. కాగాఈ ఏడాది మొదట్లో కూడా అనారోగ్య కారణాల వల్ల ఇదే ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కాగా ప్రస్తుతం ఆయన ఆసుపత్రి ()లో చేరడానికి కారణం ఇంకా వెల్లడి కాలేదు.
అద్వానీ రాజకీయ ప్రయాణం
నవంబర్ 8, 1927న కరాచీలో జన్మించిన అద్వానీ (Lal Krishna Advani) 14 ఏళ్ల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో సభ్యుడిగా మారారు. 1947లో విభజన తర్వాత, ఆయన తన కుటుంబంతో సహా భారతదేశానికి వలస వచ్చారు. 1951లో, లాల్ కృష్ణ అద్వానీ, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌లో చేరారు. 1970లో రాజ్యసభలో ప్రవేశించి, రెండేళ్ల తర్వాత పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో, అద్వానీ, ఆయన సహచరుడు అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) అరెస్టయ్యారు.
977లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, అద్వానీ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా నియమితులయ్యారు. 1980లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్థాపనలో కీలక పాత్ర పోషించారు.
1984 సార్వత్రిక ఎన్నికలలో కేవలం రెండు స్థానాల నుంచి 1990లలో జాతీయ శక్తిగా ఎదిగేందుకు బిజెపిని అగ్రపథాన నిలపడంతో అద్వానీ కీలక పాత్ర పోషించారు.ఇక రామజన్మభూమి ఉద్యమంలో ఆయన నాయకత్వం, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం పోరాడడం బిజెపి (BJP) రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేసింది
. ఎల్‌కె అద్వానీ మూడు సార్లు బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఉప ప్రధానిగా, హోం మంత్రిగా పదవులను నిర్వహించారు. 2009 సార్వత్రిక ఎన్నికలలో, అద్వానీని బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినప్పటికీ ఆ పార్టీ విజయం సాధించలేకపోయింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..