సాహిత్యం : నిన్న.. కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు..

సాహిత్యం : నిన్న.. కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు..

Literature article

*నిన్న*

కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు

ఇప్పుడు నీతో ఉన్నా నీవు గుర్తించనిది
తరువాత జ్ఞాపకమై వేదిస్తుందేమో..!!

పరిమితి మరిచిన వ్యాపకాల మాయ
మనిషిలోని మనసును మాయం చేసి
మమతకు దూరంగా తీసుకెళ్తోంది..
కన్నీళ్లను కూడా పట్టించుకోని అతని నైజం
ఆమె దుఃఖన్ని తలగడలో దాచుకోమంటే

మౌనంగా రోధించిన సహనం
జీవితాన్ని సైతం వెలివేసుకుని వెళ్ళాక
ఒంటరితనంలో వెలితి అర్ధమౌతున్నా ఏం లాభం
ఆ ఆవేదన వెనుక ఉన్న నిరాశ…
వెలివేతలో ఉన్న ఎదకోత..
ఇప్పుడు స్వయంగా
అనుభవించక తప్పదు..!!

READ MORE  నన్ను క్షమించండి...

*అనూశ్రీ గౌరోజు*


Literature

జీవం

కన్నులజారే కన్నీటిలాగే
మబ్బులమాటున దాగిన చినుకుకైనా
కురిస్తే పొదువుకునే తావొకటి కావాలి..

పత్రంపై ముత్యంగానో
పువ్వుపై స్పర్శగానో
పుడమిలో చిన్న తడిగానో…
నిలిచేది కాసేపైనా
తనకంటూ ఓ చెలిమితోడు కావాలి..

మనసుకైనా అంతే
కష్టమో కన్నీళ్ళో తడిమితే
కాస్త ఓదార్పు మంత్రమేసే
నిజమైన ఒక భరోసా కావాలి..

ఓ చిన్న చేయూత
చేయందించే వాత్సల్యం
భారాలేవీ మోయకపోయినా
మనసును తేలిక చేస్తుంది..
సమస్యలతో తలపడే శక్తినిస్తుంది..
తుది గడియలకు సైతం జీవం పోస్తుంది..!

READ MORE  నన్ను క్షమించండి...

అనూశ్రీ…


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *