Saturday, April 19Welcome to Vandebhaarath

Prayagraj Fire Accident : మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం

Spread the love

Prayagraj Fire Accident : మహా కుంభమేళా ప్రాంతంలో ఆదివారం సిలిండర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అదృష్ట‌వ‌శాత్తు ఎటువంటి ప్రాణనష్టం జ‌ర‌గ‌లేదు.
“మహా కుంభమేళా సెక్టార్ 19లో రెండు సిలిండర్లు పేలడంతో శిబిరాల్లో భారీ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని అఖారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ భాస్కర్ మిశ్రా తెలిపారు.

మహా కుంభ్ 2025 అధికారిక X హ్యాండిల్ లో ఓ పోస్టులో వివ‌రాలు వెల్ల‌డించారు. “చాలా విచారకరం! #మహాకుంభ్‌లో జరిగిన అగ్నిప్రమాదం అందరినీ కలచివేసింది. ప్ర‌భుత్వం వెంట‌నే ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందరి భద్రత కోసం మా గంగాదేవిని ప్రార్థిస్తున్నాం. మంటలు అదుపులో ఉన్నాయని, అవి వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.

READ MORE  CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్‌కౌంటర్.. 20,221 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల అరెస్టు..

Prayagraj Fire Accident : కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన యోగీ ప్రభుత్వం

తాత్కాలిక మహా కుంభ్ నగరం 10,000 ఎకరాల్లో విస్తరించి ఉంది. కోటి మందికి పైగా యాత్రికులు, భ‌క్తులు ఇక్క‌డ ఉంటున్నారు. ప్రతిరోజూ దాదాపు 20 లక్షల మంది సందర్శకులు వస్తుంటారు. అగ్నిప్రమాదం, తొక్కిసలాట మొదలైన సంఘటనలను జ‌ర‌గ‌కుండా సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్ర‌భుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది .


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

READ MORE  రోడ్డు ప్రమాదాల నివారణకు రూ.40వేల కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *