Wednesday, April 16Welcome to Vandebhaarath

దక్షిణ మధ్య రైల్వేలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.83,000 కోట్లు : మంత్రి కిషన్ రెడ్డి

Spread the love

South Central Railway  | దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి సుమారు 83,000 కోట్లు కేటాయించిన‌ట్లు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. సికింద్రాబాద్ రైల్ నియంలో గురువారం జ‌రిగిన‌ సమావేశంలో కేంద్ర మంత్రి, SCR జోన్ పరిధిలోని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 10 మంది ఎంపీలు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే ప‌రిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల‌పై రైల్వే అధి కారులుతో ఎంపీలు చర్చించారు. స‌మావేశం అనంత‌రం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైళ్ల హాల్టింగ్, కొత్త రైల్వే లైన్లు,రైల్వే అండర్ బ్రిడ్జీలు, అండర్ సాస్ వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు వారి వారి నియోజకవర్గాల పరిధిలో రైల్వే సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.

READ MORE  Hyderabad MMTS : గ్రేట‌ర్ లో భారీగా త‌గ్గిన‌ ఎంఎంటీఎస్ సర్వీసులు.. .

అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ… దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగుతున్న వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.83 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. గత సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే కొత్త లైన్లు, డబుల్ లైన్లు, గేజ్ మార్పిడి వంటి పనుల కింద 415 కిలోమీటర్ల అదనపు ట్రాక్ ను నిర్మించామని తెలిపారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద తెలంగాణలో 40 స్టేషన్లను రూ. 2,635 కోట్ల వ్యయంతో కనీవినీ ఎరుగని రీతిలో పునరాభివృద్ధి పనులను చేపట్టామని గుర్తుచేశారు. ఆ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. రూ. 650 కోట్లతో వరంగల్ లో రైల్ మాన్ ఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నామని కిషన్ రెడ్డి లిపారు.  రాబోయే రోజుల్లో వరంగల్ లోనే వ్యాగన్లు, కోచ్ లను తయారు చేస్తారని, దీని వల్ల సుమారు 3వేల మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు.


తెలంగాణలో భారీగా రైల్వే లైన్లకు తుది సర్వేలు చేయాలని రైల్వో బోర్డు నిర్ణయించిందని, ఫైనల్ కోలేషన్ సర్వేలో చేపట్టే 15 ప్రాజెక్టులకు 2,640 కిలోమీటర్ల అభివృద్ధికి ప్రతిపాదనలు పెట్టామని కిషన్ రెడ్డి  దీనికి 50వేలకోట్లకు పైగా ఖర్చు వెచ్చించనున్నట్లు  చెప్పారు. రూ.720కోట్లతో  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను ఎయిర్ పోర్టు తరహాలో సుందరీకరిస్తున్నామని వొచ్చే ఏడాది డిసెంబర్ వరకు దీన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే రూ.430 కోట్లతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Cherlapalli Railway Terminal) ను అత్యంత ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నామని  దీనికి అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర  ప్రభుత్వాన్నికోరామని, ఈ రోడ్డు పనులు పూర్తి కాకపోయినప్పటికీ వొచ్చే నెలలో చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను ప్రారంభిస్తామన్నారు. అలాగే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ ను పొడిగించనున్నమన్నారు.

READ MORE  రాస్ట్రంలో త్వ‌ర‌లో ఎయిర్ అంబులెన్స్‌లు..

సమావేశంలో ఎంపీలు జీ నగేష్, రఘురాంరెడ్డి, బలరామ్ నాయక్, డీకే అరుణ, ఈటల రాజేందర్, కడియం కావ్య, కెఆర్ సురేష్ రెడ్డి, కర్ణాటక ఎంపీలు సాగర్ ఈశ్వర్ ఖంద్రే, రాధాకృష్ణ దొడ్డ మని తదితరులు పాల్గొన్నారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *