కౌలు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..! వీరి కోసం కొత్త పథకాల రూపకల్ప!?
New Schemes For Tenant Farmers | కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) రుణ పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తోంది. కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) రుణాలపై పరిమితిని పెంచడానికి, అలాగే ఆత్మనిర్భర్ నిధి (PM-SVANIdhi) తరహాలో కౌలు రైతుల కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది.
గత నెలలో జరిగిన CII ఫైనాన్సింగ్ 3.0 సమ్మిట్‌లో ఆర్థిక సేవల విభాగం అదనపు కార్యదర్శి MP తంగిరాల మాట్లాడుతూ, “మూడు లేదా నాలుగు సంవత్సరాల క్రితం నిర్ణయించిన కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణ పరిమితులను పెంచాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకం 1998లో రైతులకు వారి వ్యవసాయ పనుల కోసం సకాలంలో రుణాన్ని అందించాలనే ప్రాథమిక లక్ష్యంతో ప్రవేశపెట్టారు. 1998లో ప్రారంభమైన ఈ పథకం గరిష్టంగా రూ.3 లక్షల వరకు రుణాలు ఇస్తారు. కేసీసీ ఖాతాల్లో బకాయిలు రూ.9.81 లక్షల కోట్లుగా ఉన్నాయి. కేంద్రం మద్దతుతో రైతులకు 2% వడ్డీ రాయితీని, 3% ఫాస్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్‌ను అందిస్తుంది.
New Schemes For Tenant Farmers మొదట్లో కేవలం వ్యవసాయ కార్యకలాపాలపై దృష్టి సారించిన ఈ పథకం.. ఆ తరువాత 2004లో వ్యవసాయ అనుబంధ, వ్యవసాయేతర కార్యకలాపాలకు సంబంధించిన రైతుల పెట్టుబడుల కోసం రుణాలు ఇవ్వడం ప్రారంభించింది. 2012లో ఇండియన్ బ్యాంక్ CMD, TM భాసిన్ నేతృత్వంలోని కమిటీ, కేసీసీ ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి అలాగే ఎలక్ట్రానిక్ కిసాన్ క్రెడిట్ కార్డ్‌ల జారీని ప్రారంభించింది. ఇటీవల వీధి వ్యాపారుల కోసం PM స్ట్రీట్ వెండర్ ఆత్మనిర్భర్ నిధి పథకం విజయవంతమైన తర్వాత, కొత్తగా కౌలు రైతుల కోసం కూడా కేంద్రం అలాంటి పథకాన్ని అమలు చేయాలని చూస్తోందని తంగిరాల తెలిపారు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) పథకాన్ని సింగిల్ విండో ద్వారా రైతులకు బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి సకాలంలో, తగినంత రుణ సహాయం పొందేలా చూసేందుకు ప్రవేశపెట్టారు. ఈ పథకం రైతులకు వారి వ్యవసాయ కార్యకలాపాలకు సంబంధించిన వివిధ అంశాలలో సహాయం చేస్తుంది.
- పంటల సాగు కోసం స్వల్పకాలిక రుణ అవసరాలను తీర్చడం
- పంట అనంతర ఖర్చులకు పెట్టుబడులు
- మార్కెటింగ్ కోసం రుణాలు అందించడం
- రైతు కుటుంబాల వినియోగ అవసరాలను తీర్చడం
- వ్యవసాయ ఆస్తుల నిర్వహణ, అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలకు వర్కింగ్ క్యాపిటల్ అందించడం
- పెట్టుబడి క్రెడిట్ అవసరాలను తీర్చడం వ్యవసాయం, సంబంధిత కార్యకలాపాలు
తక్కువ వడ్డీతో రుణాలు..
గత నెలలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా పొందిన వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాల కోసం ఉద్దేశించిన స్వల్పకాలిక రుణాల కోసం సవరించిన వడ్డీ రాయితీ పథకం (MISS) పొడిగింపును ప్రకటించింది. పర్యవసానంగా, అర్హులైన రైతులు ఇప్పుడు సబ్సిడీ వడ్డీ రేట్లలో రూ. 3 లక్షల రుణాలను పొందగలుగుతున్నారు.
సవరించిన వడ్డీ రాయితీ పథకం కింద, అర్హులైన రైతులు 7% తగ్గిన వడ్డీ రేటుతో రుణాలు పొందుతారు. తమ రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే వారు సంవత్సరానికి 3% అదనపు వడ్డీ రాయితీని కూడా పొందుతారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రుణాలు ఇచ్చే సంస్థలకు వడ్డీ రాయితీ రేటు 1.5% ఉంటుందని RBI పేర్కొంది. ఈ పథకం కింద రైతులకు అనేక ప్రయోజనాలను అందించేందుకు పేర్కొన్న స్వల్పకాలిక రుణాలను పొందడానికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది.
కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం కింద రైతులకు రూ.4.26 లక్షల కోట్ల పంట రుణాలు పంపిణీ చేసినట్లు ఇటీవల లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఒక ప్రకటనలో వెల్లడించారు. అదనంగా, వ్యవసాయోత్పత్తిని పెంపొందించడానికి, రైతుల సంక్షేమానికి కేంద్రం అనేక చర్యలు చేపడుతోందని చెప్పారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 52 కోట్ల ఖాతాలు ప్రారంభించినట్లు వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..