Friday, August 29Thank you for visiting

కేసీఆర్ నుంచి జానా రెడ్డి వరకు.. అసెంబ్లీకి ఐదు కంటే ఎక్కువసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతలు వీరే…

Spread the love

హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. ఈ ఎన్నికల్లో తలలు పండిన రాజకీయవేత్తలతోపాటు యువ నాయకులు బరిలో దిగుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఐదుసార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు అసెంబ్లీకి ఎన్నికైన నేతలు ఎవరో ఒక సారి తెలుసుకుందాం.

రాష్ట్రంలో ఈ ఘనత సాధించిన నేతలు 45 మందికి పైగా ఉన్నారు.

ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు (CM KCR) ఎనిమిది సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు (1985, 1989, 1994, 1999, 2001 బై పోల్, 2004, 2014, 2018).

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానా రెడ్డి (Jana Reddy) , బీజేపీ నేత ఈటెల రాజేందర్‌ (Etala rajender) ఇద్దరూ ఏడుసార్లు విజయం సాధించారు.

జానా రెడ్డి 1983, 1985లో టీడీపీ టిక్కెట్‌పై గెలుపొందారు. ఆ తర్వాత 1989, 1999, 2004, 2009, 2014లో కాంగ్రెస్‌ టికెట్‌పై విజయం సాధించారు.

ఈటల రాజేందర్ (Etela Rajender) 2004, 2008 (By Poll), 2009, 2010 (By Poll), 2014, and 2018, టీఆర్ఎస్ (BRS) పార్టీ తరుపున ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. ఆతర్వాత , 2021లో బీజేపీలో చేరిన తర్వాత వచ్చిన ఉపఎన్నికల్లో కూడా గెలిచారు.

ఆ తర్వాత జి.గడ్డెన్న, టి జీవన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పోచారం శ్రీనివాస రెడ్డి, సి.రాజేశ్వర్ రావు, టి.హరీష్ రావు, డాక్టర్ ఎం.చెన్నా రెడ్డి, ముంతాజ్ అహ్మద్ ఖాన్, నర్రా రాఘవ రెడ్డి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

ఐదుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన నాయకులలో జె.రాజారాం, గంప గోవర్ధన్, మండవ వెంకటేశ్వరరావు, కరణం రామచంద్రరావు, సి.విఠల్ రెడ్డి, కె.హరీశ్వర్ రెడ్డి, పి.జనార్దన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, దానం నాగేందర్, అక్బరుద్దీన్ ఒవైసీ, సలావుద్దీన్ ఒవైసీ, అమానుల్లా ఖాన్, జి సాయన్న, డాక్టర్ పి.శంకర్ రావు, గుర్నూత రెడ్డి, జె.కృష్ణారావు, ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, పి.గోవర్ధన్ రెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉన్నారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *