Tuesday, April 1Welcome to Vandebhaarath

వ్యాగన్ల తయారీ కేంద్రంగా కాజీపేట..

Spread the love

దేశంలో ఇది రెండో అతిపెద్ద పరిశ్రమ

సుమారు 4వేల మందికి ఉపాధి

ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట సమీపంలోని మడికొండలో భారీ పెట్టుబడి తో రైల్వే వ్యాగన్ మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రధాని మోదీ ప్రారంభించారు. 160 ఎకరాల విస్తీర్ణంలో రూ.520 కోట్ల అంచనా వ్యయంతోఈ వ్యాగన్ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. కాజీపేట్ లో ప్రస్తుతం రైల్వే ఓవరాలింగ్ యూనిట్ కు అనుమతి ఉంది. అయితే ఇప్పుడు కేంద్రం ఓవరాలింగ్ యూనిట్ తో పాటుగా వ్యాగన్ తయారీ యూనిట్ కూడా ఏర్పాటు చేస్తోంది. ఈ కొత్త రైల్వే ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానిక రైల్వే అధికారులు చెబుతున్నారు. 2025 వరకు ఈ వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తుందని పేర్కొంటున్నారు. వ్యాగన్ తయారీ పరిశ్రమ ప్రారంభమైన మొదటి సంవత్సరం 1,200 వ్యాగన్లు, రెండో ఏడాది 2,400 వ్యాగన్లను తయారు చేస్తామని అంటున్నారు. ఇక మొత్తంగా నెలకు 200 వాగన్లు ఉత్పత్తి జరుగుతుంది.

Kazipet Railway Wagon Unit

దేశంలోనే అతిపెద్ద వ్యాగన్ పరిశ్రమ

కాజీపేట లో వ్యాగన్ తయారీ పరిశ్రమ (Kazipet Railway Wagon Unit) అందుబాటులోకి వస్తే ఇది దేశంలోనే 2వ అతిపెద్ద యూనిట్ గా నిలవనుంది. ఇక అతిపెద్దదైన వ్యాగన్ పరిశ్రమ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉంది. ప్రస్తుతం భారతీయ రైల్వేలో వ్యాగన్ల కొరత ఉన్న కారణంగా వ్యాగన్ల తయారీ పరిశ్రమ కాజీపేటలో నిర్మిస్తున్నామని, ఇక్కడ తయార య్యే వ్యాగన్లతో ఇండియన్ రైల్వేలో సరుకు రవాణా వ్యవస్థ చాలావరకు మెరుగువుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఓపెన్ తోపాటు క్లోజ్డ్ వాగన్లతో పాటు అన్ని రకాల సరుకు రవాణాకు వినియోగపడేలా ఉండే వ్యాగన్లు ఇక్కడ సిద్ధమవుతాయని అధికారులు చెబుతున్నారు.

READ MORE  Parking Fees | మాల్స్, మల్టీప్లెక్స్‌ల లో వాహ‌నాల పార్కింగ్ పై కీల‌క ఆదేశాలు

భారతీయ రైల్వేలో ప్రస్తుతం వ్యాగన్, కోచ్ ల కొరత ఉన్నప్పటికీ వాటి విలువలో రెండూ సమానమేనని, దేశంలో ఇప్పటికే చాలా కోచ్ ఫ్యాక్టరీలు ఉన్నప్పటికీ, కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాగన్ ఫ్యాక్టరీకి అనుమతిచ్చింది. దీంతో ఆ దిశగా శంకుస్థాపన చేశారు. 2025 నాటికి ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి వ్యాగన్లు తయారీ ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *