Wednesday, April 16Welcome to Vandebhaarath

Karimnagar New Railway Line | క‌రీంన‌గ‌ర్ – హ‌న్మ‌కొండ జిల్లాల‌ను క‌లుపుతూ కొత్త రైల్వే లేన్‌

Spread the love

హ‌స‌న్ ప‌ర్తి రోడ్ స్టేష‌న్ క‌రీంన‌గ‌ర్ మ‌ధ్య రైల్వేలైన్ నిర్మాణంపై క‌ద‌లిక‌

Karimnagar – Hasanparthy Railway Line  | కరీంనగర్, ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాల‌ను కలుపుతూ రెండో రైల్వే లైన్ నిర్మాణంపై క‌ద‌లిక వ‌చ్చింది. హనుమకొండ జిల్లా ప‌రిధిలోని లోని హసన్‌పర్తి రోడ్డు రైల్వే స్టేష‌న్ నుంచి కరీంనగర్‌ రైల్వే స్టేషన్‌ మధ్య రైల్వేలైన్ కోసం రెండు జిల్లాల వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రైలు మార్గంపై ఎట్ట‌కేల‌కు ఆశ‌లు చిగురిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ గ‌త మంగ‌ళ‌వారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. క‌రీంన‌గ‌ర్ రైల్వే లైన్ ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించ‌డ‌మే కాకుండా పనుల‌ను త్వరగా చేపట్టాలని కోరారు. దీనికి రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారు

వరంగల్‌ నుంచి కరీంనగర్‌కు వెళ్లేందుకు ప్ర‌స్త‌తుం రోడ్డు మార్గ‌మే శ‌ర‌ణ్యం. నిత్యం వంద‌లాది ఆర్టీసీ బ‌స్సులు, ప్రైవేటు వాహనాలు రెండు జిల్లాల మ‌ధ్య రాక‌పోక‌లు సాగిస్తుంటాయి. బ‌స్సులు కూడా నిత్యం కిట‌కిట‌లాడుతుంటాయి. ప్ర‌స్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి నిజామాబాద్‌, సిర్ పూర్ కాగ‌జ్ న‌గ‌ర్ కు మెము రైళ్లు, గూడ్స్ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. క‌రీంన‌గ‌ర్ నుంచి ల‌క్షెట్టిపేట రోడ్డువైపు గ‌తంలోనే రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. క‌రీంన‌గ‌ర్ రైల్వే స్టేష‌న్ నుంచి వారానికి రెండుసార్లు తిరుపతి ఎక్స్‌ప్రెస్, నిజామాబాద్‌, సిర్‌పూర్‌కాగజ్‌నగర్‌కు మెము రైళ్లు, గూడ్సు రైళ్లు నడుస్తున్నాయి. కాజీపేట రైల్వే స్టేషన్‌ నుంచి కరీంనగర్‌కు రైలు మార్గం అందుబాటులోకి వ‌స్తే .. ఖ‌ర్చుతోపాటు ప్ర‌యాణ స‌మ‌యం గ‌ణ‌నీయంగా త‌గ్గిపోతుంది. పాటు, ప్రతి రోజు కరీంనగర్‌కు వెళ్లేవారు రైళ్లను ఆశ్రయించే చాన్స్‌ ఉంది.

READ MORE  Maha Shivaratri Buses | మ‌హా శివ‌రాత్రి శ్రీశైలానికి 800, వేముల‌వాడ‌కు 700 ప్ర‌త్యేక బ‌స్సులు

మొత్తం 62 కిలోమీటర్ల రైల్వే లైన్‌..

Karimnagar – Hasanparthy Railway Line | కరీంనగర్ నుంచి హసన్‌పర్తి రోడ్ మ‌ధ్య కొత్త‌ రైల్వే లైన్ ను 2011-12, 2014 బడ్జెట్‌లో ప్రస్తావించారు. కరీంనగర్ నుంచి హసన్‌పర్తి వ‌ర‌కు 62.05 కి.మీ మేర లైన్ కు రూ.464 కోట్లు ప్రతిపాదించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మొద‌టిసారి రూ.1.50 కోట్ల నిధులు విడ‌దుల చేయ‌గా భూమి సర్వే చేశారు. ఇందులో దండేపల్లి, హుజూరాబాద్, తడిగల్, అన్నారం మీదుగా కరీంనగర్‌ వరకు సాటిలైట్‌ సర్వే నిర్వ‌హించారు. ప్రస్తుతం భూసేకరణ చేసి టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తే 2029 నాటికి హ‌స‌న్ ప‌ర్తి – కరీంనగర్‌కు రైల్వే లైన్ అందుబాటులోకి రానుంది.

READ MORE  TSRTC New Buses : ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కష్టాలు తీర్చేందుకు నేడు రోడ్డెక్కనున్న 80 కొత్త బస్సులు

తెలంగాణ‌లో ఖ‌మ్మం, వికారాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలు గ్రానైట్ వ్యాపారం పెద్ద ఎత్తున జ‌రుగుతుంది. ఇక్కడి గ్రానైట్ ను ఉప్పల్‌ రైల్వే స్టేషన్‌ లేదా కాజీపేట వరకు లారీలలో తీసుకొచ్చి అక్క‌డ‌ గూడ్సు రైళ్ల ద్వారా కాకినాడ పోర్టుకు త‌ర‌లిస్తున్నారు. ఆ త‌ర్వాత అక్కడి నుంచి విదేశాలకు ఎగుమ‌తి చేస్తున్నారు. అయితే కరీంనగర్ – కాజీపేట రైల్వేలైన్ అందుబాటులోకి వ‌స్తే వరంగల్‌, ఖ‌మ్మం మీదుగా నేరుగా కాకినాడ పోర్ట్ కు వేగంగా త‌ర‌లించచ్చు. ఇక సికింద్రాబాద్ నుంచి కూడా స‌రుకుల ర‌వాణా, ప్ర‌యాణికుల రాక‌పోక‌లు కూడా సుల‌భ‌ర‌త‌మ‌వుతాయి. అలాగే మణుగూరు-రామగుండం రైలు మార్గం కూఆ పూర్తయితే బొగ్గు రవాణా కరీంనగర్‌ మీదుగా కూడా మహారాష్ట్రకు పంపడానికి వీలు క‌లుగుతుంది.

READ MORE  ఎయిర్ పోర్టుల తరహాలో రైల్వేస్టేషన్లు..

కరీంనగర్ – హ‌స‌న్‌ప‌ర్తి కొత్త రైలు మార్గం పూర్తియితే వరంగల్ నుంచి జ‌గిత్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్ కూడా ప్రయాణ స‌మ‌యం, ఖ‌ర్చులు కూడా భారీగా త‌గ్గిపోతాయి. కరీంనగర్‌ నుంచి జగిత్యాల, కోరుట్ల మీదుగా నిజామాబాదుకు వెళ్లడానికి అవకాశం క‌ల‌గుతుతుంది. అలాగే మహారాష్ట్రకు కూడా సుల‌భంగా వెళ్లవ‌చ్చు.

కాగా కరీంనగర్ – హసన్‌పర్తి రోడ్ రైల్వే లైన్ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామ‌ని కేంద్ర మంత్రి బండి సంజ‌య్ తెలిపారు. రైల్వే మంత్రి కూడా సానుకూలంగా స్పందించార‌నితెలిపారు. ఈ రైల్వే లైన్ వ్యయం రూ.1400 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. బల్లార్ష- వరంగల్‌- విజయవాడ మధ్య మూడోలైను పనులు, తెలంగాణ వ్యాప్తంగా అనేక కొత్త లైన్ల ప్రతిపాదన చేసింద‌ని . ఇందులో కరీంనగర్‌- హసన్‌పర్తి రోడ్‌ రైలు మార్గం కూడా ఉంద‌ని తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *