Kanwar Yatra | కన్వర్ యాత్ర నిబంధనలపై సుప్రీమ్ కోర్టు మధ్యంతర స్టే.. యూపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు..
Kanwar Yatra eateries row : కన్వర్ యాత్ర మార్గంలోని తినుబండారాల షాపుల యజమానుల పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు సోమవారం (జూలై 22) మధ్యంతర స్టే విధించింది. షాపు యజమానులు తమ షాపుల ముందు తమ పేరు లేదా గుర్తింపును చూపించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. ‘వెజ్ లేదా నాన్ వెజ్’ ఆహారాన్ని మాత్రమే ప్రదర్శించాలని దుకాణ యజమానులను కోర్టు ఆదేశించింది.
Kanwar Yatra : న్యాయమూర్తులు హృషికేష్ రాయ్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది, ఈ ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సమాధానాలు కోరింది. ఆహార విక్రయదారులు యజమానులు, ఉద్యోగుల పేర్లను ప్రదర్శించాలని బలవంతం చేయరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను జూలై 26వ తేదీకి సుప్రీంకోర్టు ఖరారు చేసింది.
“పై ఆదేశాలను అమలు చేయడాన్ని నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సముచితమని మేము భావిస్తున్నాం. మరో మాటలో చెప్పాలంటే, ఆహార విక్రయదారులు ఆహార రకాలను ప్రదర్శించవలసి ఉంటుంది, కానీ యజమానులు, సిబ్బంది పేర్లను ప్రదర్శించమని బలవంతం చేయకూడదు” అని బెంచ్ పేర్కొంది. ఈ విషయాన్ని శుక్రవారం తదుపరి విచారణకు పోస్ట్ చేస్తూ చెప్పారు.
ఉజ్జయిని నగరంలో..
ఇదిలావుండగా బిజెపి పాలిత ఉజ్జయిని మునిసిపల్ కార్పొరేషన్, ఓల్డ్ సిటీలో తమ సంస్థల వెలుపల వారి పేర్లు, మొబైల్ నంబర్‌లను ప్రదర్శించాలని దుకాణాల యజమానులను ఆదేశించింది. ఉల్లంఘించిన వారికి మొదటి తప్పుకు రూ.2,000, రెండోసారి రూ.5,000 జరిమానా విధించనున్నట్లు ఉజ్జయిని మేయర్ ముఖేష్ తత్వాల్ శనివారం తెలిపారు. ఈ ఆర్డర్ భద్రత మరియు పారదర్శకతను నిర్ధారించడానికి ఉద్దేశించబడింది. ముస్లిం దుకాణదారులను లక్ష్యంగా చేసుకోవడానికి ఉద్దేశించినది కాదని మేయర్ చెప్పారు. పవిత్రమైన ఉజ్జయిని మహాకాళి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రపంచవ్యాప్తంగా భక్తులను ఆకర్షిస్తుంది, ముఖ్యంగా శ్రావణ మాసంలో ఇది సోమవారం ఈ ఆలయానికి భక్తులు పోటెత్తుతారు.
శ్రావణ మాసం ప్రారంభంతో సోమవారం ప్రారంభమైన కన్వర్ యాత్ర కోసం పలు రాష్ట్రాలలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ యాత్రలో భాగంగా లక్షలాది మంది శివ భక్తులు హరిద్వార్‌లోని గంగానది నుంచి పవిత్ర జలాన్ని తమ ఇళ్లకు తీసుకువెళతారు, దారి పొడవునా ఉన్న శివాలయాలలో సమర్పిస్తారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..