Karnool : కంచి కామకోటి పీఠం (Kanchi Kamakoti Peetham) కొత్తగా పొదిలి (Podili) లోని ఒంగోలు సమీపంలో నిర్మించిన సనాతన ధర్మ సేవా గ్రామమైన కంచి కామకోటి శంకర విద్యాలయం (sankara vidyalaya) అందుబాటులోకి వచ్చింది. యువతలో సనాతన ధర్మ విలువలను పెంపొందించడమే ఈ విద్యాలయం లక్ష్యం. 31 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ విద్యా కేంద్రంలో ఆధునిక ఇంగ్లీషు-మీడియం విద్యను వేద అధ్యయనాలు, క్రీడలు, కళలలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విలువ-ఆధారిత విద్యను అందించనున్నారు. అనేక సాంప్రదాయ వేద పాఠశాలలు కేవలం మతపరమైన అధ్యయనాలపై దృష్టి సారిస్తుండగా, ఈ సంస్థ వ్యాల్యూ బేస్డ్ లర్నింగ్‌తో ఆధునిక బోధనా పద్ధతులను అనుసరించడం విశేషం.
పాఠశాల ప్రస్తుతం 6 & 7 తరగతుల్లో 44 మంది విద్యార్థులకు సేవలను అందిస్తోంది. ఇది కులం లేదా మతంతో సంబంధం లేకుండా విద్యను అందిస్తోంది .ఆధునిక విద్యలో తమను తాము అభివృద్ధి చేసుకుంటూ స్తోత్రాలు, వేదాలను అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం క్యాంపస్‌లో బ్రాహ్మణ బాలుర హాస్టల్ ఉంది. అన్ని వర్గాల విద్యార్థులకు ఆధ్యాత్మిక విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి ఇలాంటి మరిన్ని హాస్టళ్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
సిబ్బంది క్వార్టర్‌లు, హాస్టల్‌ల నిర్మాణం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, హెల్త్ సెంటర్, 300-పశువులతో కూడిన గోశాల ఉంది. చక్కటి సౌకర్యాలతో కూడిన పాఠశాల భవనాన్ని ఈ సంస్థ నిర్మించింది. “విద్యార్థులను ఉన్నతులుగా ప్రపంచ పౌరులుగా తయారు చేయడం ద్వారా ఆధునిక విద్యలో సనాతన ధర్మ విలువలను మిలితం చేయడం తమ లక్ష్యమని, తద్వారా పిల్లలు విద్యాపరంగా ఆధ్యాత్మికంగా రాణించి, సమాజ సమగ్ర అభివృద్ధికి దోహదపడతారు” అని పాఠశాల డైరెక్టర్ అశ్విని కుమార్ అన్నారు.
గణితం, రొబోటిక్ ల్యాబ్స్
పాఠశాల సంస్కృత భాష ప్రాధాన్యతను వివరిస్తుంది. అలాగే గణితం, రోబోటిక్స్ కోసం ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. సాంప్రదాయిక లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ కాకుండా, పాఠశాల దాని డిజిటల్ లైబ్రరీ, స్మార్ట్‌బోర్డ్ ఆధారిత తరగతి గది బోధనా పద్ధతులను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉంది. వేద అధ్యయనాలపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పాఠాలను బోధిస్తారు. సాధారణ పాఠశాల వేళలు పూర్తయిన తర్వాత పాఠశాలలోని విద్యార్థులందరికి విలువ ఆధారిత విద్య, భగవద్గీత తరగతులను బోధిస్తారు. Kanchi Kamakoti Peetham
అడ్మిషన్లు ఇలా..
పటిష్టమైన బోధన కోసం వివిధ పాఠశాలల నుంచి కొంతమంది అనుభవజ్ఞులైన అధ్యాపకులను నియమించింది. నాణ్యమైన ఆంగ్ల-మీడియం బోధనను అందించడానికి దేశవ్యాప్తంగా పేరుపొందిన పాఠశాలల నుంచి అధ్యాపకులను నియమించుకుంది. అలాగే సంగీత, వాయిద్య సంగీతం, కళ, క్రాఫ్ట్ మొదలైన వాటిలో స్కిల్ కోర్సులను కూడా అందిస్తుంది. . ఈ కార్యక్రమాలతో పాటు, తెలుగు, సంస్కృత సాహిత్యంలో విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించడానికి కూడా పాఠశాల ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విద్యార్థుల అడ్మిషన్ల కోసం ప్రవేశ పరీక్షతోపాటు పాఠశాల డైరెక్టర్ ప్రిన్సిపాల్‌తో ఉమ్మడి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..