Wednesday, April 16Welcome to Vandebhaarath

Kalki Movie OTT | కల్కి సినిమా.. ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలయ్యేది అప్పుడేనా..!

Spread the love

Kalki 2898 AD OTT Release Date | ప్రభాస్ నటించిన కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద తూఫాన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం అద్భుత‌మైన‌ కథాంశం, దర్శకత్వ ప్ర‌తిభ‌ మాత్రమే కాకుండా విస్మయానికి గురిచేసే భారీ తారాగణానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, రాజేంద్ర ప్రసాద్, శోభ‌న, దుల్క‌ర్ స‌ల్మాన్‌ తదితరులు న‌టిచారు. అయితే  OTT ప్లాట్‌ఫారమ్‌లలో కల్కి 2898 AD ఎప్పుడు అందుబాటులో ఉంటుంది? అనేదానిపై ఉత్కంఠ‌కు తెర వీడింది. క‌ల్కి మువీని ప్రైమ్ వీడియో ఇండియా తెలుగు, తమిళ కన్నడ, మలయాళంలో ప్రసారం చేయబోతోంది, అయితే నెట్‌ఫ్లిక్స్ ఇండియా ఈ హిందీ వెర్షన్‌ను అందుబాటులోకి తెసుకువ‌స్తోంది.

READ MORE  తెలుగులో రామాయణ యానిమే మూవీ విడుదల తేదీ ఖరారు..

Kalki Movie OTT | కాగా క‌ల్కీ సినిమా ప్రైమ్ వీడియో ఇండియాలో స్ట్రీమింగ్ తేదీని ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. నివేదికల ప్రకారం కల్కి 2898 AD’ సెప్టెంబర్ రెండవ వారంలో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంటుందని చెబుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి వ‌సూళ్లు రాబ‌డుతుండ‌డంతో నిర్మాతలు థియేట్రికల్ రన్‌ను పొడిగించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

కల్కి 2898 AD రూ.600 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన అత్యంత భారీ సినిమాల్లో ఒకటి. థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి ఈ మూవీ ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. కల్కి 2898 AD భారతీయ సినిమాలో మూడవ అతిపెద్ద ఓపెనర్‌గా అవతరించింది. క‌ల్కీ మువీ రిలీజ్ అయిన‌ రోజున ప్రపంచవ్యాప్తంగా రూ. 191 కోట్లను వ‌సూలు చేసింది. ఈ భారీ ఓపెనింగ్ కలెక్షన్‌తో కల్కి.. కేజీఎఫ్ 2 (రూ. 159 కోట్లు), సాలార్ (రూ.158 కోట్లు), లియో (రూ.142.75 కోట్లు), సాహో (రూ.130 కోట్లు), జవాన్ (రూ.129 కోట్లు) గ్లోబల్ ఓపెనింగ్ రికార్డులను బ్రేక్ చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన RRR ఇప్పటికీ 223 కోట్ల రూపాయల ఓపెనింగ్ కలెక్షన్‌తో టాప్ పొజిష‌న్ లో ఉంది.

READ MORE  All We Imagine as Light | విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి..

కాగా కల్కి 2898 AD వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి అశ్వనీ దత్, స్వప్న దత్, ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మించారు. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా, సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *