Wednesday, April 16Welcome to Vandebhaarath

K Surendran against Rahul Gandhi : వ‌య‌నాడ్ ల్ రాహుల్ గాంధీ పోటీగా బరిలో ఉన్న కె.సురేంద్రన్ ఎవరు?

Spread the love

Lok Sabha elections 2024 | కేర‌ళ‌లోని వయనాడ్ (Wayanad) లో కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢీకొట్టేందుకు బ‌ల‌మైన అభ్య‌ర్థిని బిజెపి బ‌రిలో దింపింది. ఏప్రిల్ 26న ఎన్నికలు జరగనున్న కేరళలో లోక్‌సభ ఎన్నికలకు మరో నలుగురు అభ్యర్థులను ఆదివారం బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలోని 20 స్థానాల్లో, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 16 ఇతర స్థానాలకు అభ్యర్థులను ముందుగా ప్రకటించింది. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌, కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌లు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్ర‌క‌టించాయి.

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్.. అలాగే సిపిఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ పై ఆధిపత్యం సాధించేందుకు బిజెపి కొన్ని ద‌శాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. ఈసారి ఎన్నిక‌ల్లో 12 స్థానాలకు బీజేపీ త‌న అభ్యర్థులను ముందుగా పార్టీ ప్రకటించింది. దాని మిత్రపక్షమైన బీడీజేఎస్ రాష్ట్రంలో నాలుగు స్థానాల్లో పోటీ చేయనుంది.

READ MORE  India TV-CNX Opinion Poll : ఈ ఎన్నికల్లో ఎన్‌డీఏకు '400' సీట్లు రావు.. ఇండియా టీవీ సర్వేలో సంచనల విషయాలు..

 

కె సురేంద్రన్ ఎవరు?

K Surendran against Rahul Gandhi  : కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీ, పార్టీ అగ్ర‌నేత‌ రాహుల్‌గాంధీ ఉన్నందున లైమ్‌లైట్‌లో ఉన్న వాయనాడ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్‌ (K Surendran)ను పోటీకి దింపింది. మ‌రోవైపు ఎల్డీఎఫ్ అభ్యర్థిగా సీపీఐ జాతీయ నేత అన్నీ రాజా ఉన్నారు.

  •  సురేంద్రన్ 2020 నుండి బిజెపి కేర‌ళ రాష్ట్ర‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. సంవత్సరాల క్రితం శబరిమలలోకి యువతుల ప్రవేశానికి వ్యతిరేకంగా కాషాయ పార్టీ త‌ర‌ఫున ఆందోళనలు చేశారు.
  • కోజికోడ్ జిల్లాలోని ఉల్లెయేరికి చెందిన కున్నుమ్మెల్ సురేంద్రన్.. భారతీయ జనతా యువ మోర్చా వయనాడ్ జిల్లా అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
  • అతను 2019 లోక్‌సభ ఎన్నికలలో పతనంతిట్ట నుండి పోటీ చేసి ఓడిపోయారు అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఉపఎన్నికల్లో సురేంద్రన్‌ని కొన్ని నుంచి బరిలోకి దింపారు, కానీ ఆయన విజయం సాధించలేకపోయారు.
  • కె సురేంద్రన్ కేంద్ర మంత్రి వి.మురళీధరన్‌కు అత్యంత సన్నిహితుడు అని కూడా అంటారు . 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మంజేశ్వరం నియోజకవర్గంలో కేవలం 89 ఓట్ల తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యారు.
  •  2021లో మంజేశ్వరం అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి కె సుందరాన్ని బెదిరించినట్లు సురేంద్రన్‌పై ఆరోపణలు వచ్చాయి.
READ MORE  Lok Sabha Elections 2024: పోలింగ్ బూత్‌లోకి మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లొచ్చా? ఎన్నారైల‌కు ఓటు హ‌క్కు ఉంటుందా?

ఇదిలా ఉండ‌గా, ఎర్నాకులంలో కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా, సంస్కృత విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌గా పనిచేసిన డాక్టర్‌ కేఎస్‌ రాధాకృష్ణన్ ను బీజేపీ అభ్యర్థిగా ప్ర‌క‌టించింది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఎర్నాకులం జిల్లాలోని త్రిపుణితుర స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
కొల్లాంలో బీజేపీ అభ్యర్థిగా నటుడు జి కృష్ణకుమార్‌ పోటీ చేస్తున్నారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, కృష్ణకుమార్.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి పోటీ చేశారు.
ఇక అలత్తూరు (ఎస్సీ) స్థానంలో బీజేపీ అభ్యర్థిగా కళాశాల మాజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టీఎన్‌ సరసు పోటీ చేస్తున్నారు. సరసు 2016లో పాలక్కాడ్‌లోని ప్రభుత్వ విక్టోరియా కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నప్పుడు వార్తల్లో నిలిచించారు. సీపీఐ(ఎం) విద్యార్థి విభాగం ఎస్‌ఎఫ్‌ఐకి చెందిన విద్యార్థుల బృందం.. ఆమె పదవీ విరమణ సందర్భంగా క్యాంపస్‌లో సింబాలిక్ సమాధిని సిద్ధం చేయ‌డం అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది.

READ MORE  Rekha Gupta | ఢిల్లీ కొత్త సీఎం గా రేఖా గుప్తా.. నేపథ్యం ఇదే..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *