ఇక చిరిగిన జీన్స్.. స్కర్టులు వేసుకొని రావొద్దు..

ఇక చిరిగిన జీన్స్.. స్కర్టులు వేసుకొని రావొద్దు..

ఒడిశాలోని జగన్నాథ ఆలయంలో జనవరి 1 నుంచి భక్తుల కోసం డ్రెస్ కోడ్

ఒడిశాలోని పూరీలోని జగన్నాథ ఆలయం (Jagannath Temple) లో భక్తులకు జనవరి 1 నుంచి డ్రెస్ కోడ్ అమలులోకి రానుంది. ఆలయం లోపల ప్రజలు హాఫ్ ప్యాంట్, షార్ట్, చిరిగిన జీన్స్, స్కర్టులు, స్లీవ్ లెస్ దుస్తులు ధరించడాన్ని నిషేధించారు.
ఒడిశాలోని పూరీలోని 12వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో జనవరి 1 నుంచి భక్తులకు డ్రెస్‌ కోడ్‌ను అమలు చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో కొంతమంది అసభ్యకరమైన రీతిలో దుస్తులతో కనిపించడంతో ‘నీతి’ సబ్‌కమిటీ (‘Niti’ sub-committee ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆలయ గౌరవాన్ని, పవిత్రతను కాపాడుకోవడం మన బాధ్యత అని, దురదృష్టవశాత్తూ కొందరు ఇతరుల మతపరమైన మనోభావాలను పట్టించుకోకుండా ఆలయాన్ని సందర్శిస్తున్నారని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ రంజన్ కుమార్ దాస్ అన్నారు.
“కొంతమంది చిరిగిన జీన్స్, స్లీవ్‌లెస్ డ్రెస్‌లు, హాఫ్ ప్యాంట్‌లు ధరించి, సముద్ర తీరంలోనో, పార్కులోనో విహరిస్తున్నట్లు గుడిలో కనిపించారు. దేవాలయం దేవుడి నివాసం, వినోద ప్రదేశం కాదు” అని చెప్పాడు. ఎలాంటి డ్రెస్‌లను అనుమతించాలో త్వరలో నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.

READ MORE  7 ఏళ్ల చిన్నారి ఊపిరితిత్తిలో చిక్కుకున్న సూది.. AIIMS వైద్యులు అయస్కాంతాన్ని ఉపయోగించి..

జనవరి 1 నుంచి..

Jagannath Temple లో  “జనవరి 1, 2024 నుండి ఆలయం లోపల డ్రెస్ కోడ్ (dress code) )ఖచ్చితంగా అమలు చేయబడుతుంది. ఆలయంలోని ‘సింగ ద్వార్’ వద్ద మోహరించిన భద్రతా సిబ్బంది ఆలయంలోని ప్రతీ హరి సేవకులకు కోడ్‌ను అమలు చేసే బాధ్యత అప్పగించాము.” అని దాస్ చెప్పారు.
మంగళవారం నుంచి భక్తులకు డ్రెస్‌ కోడ్‌పై అవగాహన కల్పించేందుకు ఆలయ నిర్వాహకులు శ్రీకారం చుట్టారు. హాఫ్ ప్యాంట్, షార్ట్, చిరిగిన జీన్స్, స్కర్టులు, స్లీవ్‌లెస్ దుస్తులు ధరించిన వ్యక్తులను ఆలయంలోకి అనుమతించబోమని తెలిపారు.

READ MORE  Puri Jagannath Temple: పూరి జ‌గ‌న్నాథ ఆల‌యంలో డ్రెస్ కోడ్..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *