Saturday, April 19Welcome to Vandebhaarath

Lok Sabha elections | లోక్‌సభ మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ.. నామినేషన్లు నేటి నుంచే..

Spread the love

Lok Sabha elections | లోక్ స‌భ తొలిద‌శ ఎన్నిక‌లకు సంబంధించి  నోటిఫికేషన్ విడుదలైంది. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఏప్రిల్‌ 19న జ‌ర‌గ‌నుంది.ఈ నేప‌థ్యంలో  ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను జారీ చేసింది. దీంతో నేటి నుంచే నామినేషన్‌ల ప్రక్రియ మొద‌లుకానుంది. బీహార్ మినహా మొద‌టి విడత లోక్‌సభ ఎన్నికలు జరిగే 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నామినేషన్‌ దాఖలుకు ఈ నెల 27 వరకు అవకాశం క‌ల్పించారు. బీహార్‌లో మాత్రం మార్చి 28 వరకు నామినేషన్ల‌ను స‌మ‌ర్పించేందుకు వెసులుబాటు ఇచ్చారు.

READ MORE  అరెస్ట్‌ సరైందే కానీ.. విచారణ ప్రక్రియ శిక్షగా మారకూడదు : కేజ్రీవాల్‌ బెయిల్‌ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య

20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ నెల‌ 28న నామినేషన్ల‌కు సంబంధించి స్క్యూటినీ నిర్వహించనున్నారు. బీహార్‌లో మార్చి 30న నామినేషన్‌ల స్క్రూటినీ జరరుతుంది. బీహార్‌ మినహా మిగితా 20 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మార్చి 30 నామినేషన్‌ల విత్ డ్రా కు తుదిగడువు విధించారు. బీహార్‌లో మాత్రం నామినేషన్‌ల ఉపసంహరణకు ఏప్రిల్‌ 2 వరకు అవ‌కాశం క‌ల్పించారు. జూన్‌ 6తో సాధారణ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది.

మొద‌టి ద‌శ‌ (First Phase election) లో 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 102 లోక్‌సభ సెగ్మెంట్ల‌కు పోలింగ్‌ జరగనుంది. అందులో తమిళనాడులోని మొత్తం 39 స్థానాలు, రాజస్థాన్లోని 12 స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లోని 8, మధ్యప్రదేశ్‌లోని 6 స్థానాలు, ఉత్తరాఖండ్‌, అసోం, మహారాష్ట్రల్లోని ఐదు చొప్ప‌న‌ స్థానాలు, బీహార్‌లోని నాలుగు స్థానాలు, పశ్చిమబెంగాల్‌లోని మూడు స్థానాలు, అరుణాచల్‌ప్రదేశ్‌, మణిపూర్‌, మేఘాలయ రాష్ట్రాల్లోని రెండేసి స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం, నాగాలాండ్‌, సిక్కిం, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌ దీవులు, జమ్ముకశ్మీర్‌, పుదుచ్చేరి, లక్షద్వీప్‌లో ఒక్కో స్థానానికి పోలింగ్ జ‌ర‌గ‌నుంది.

READ MORE  Telangana | పేద‌ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ మ‌రికొద్ది రోజుల్లోనే ఇందిర‌మ్మ ఇళ్ల‌ ల‌బ్దిదారుల ఎంపిక‌

అయితే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16న షెడ్యూల్‌ విడుదల చేసిన విష‌యం తెలిసిందే.. మొత్తం ఏడు విడ‌త‌ల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్‌, జూన్‌ 1న చివ‌రి విడత పోలింగ్‌ నిర్వహించనున్నారు. జూన్‌ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా వెల్ల‌డించ‌నున్నారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *