Israel-Iran Conflict | ఇజ్రాయిల్ పై క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్న ఇరాన్
Iran Attacks | ఇరాన్ అంతా ఊహించినట్లుగానే మూకుమ్మడి దాడులను ప్రారంభించింది. సిరియాలోని తమ కాన్సులేట్ భవనంపై దాడి ఘటన తర్వాత ప్రతీకారంతో ఊగిపోతున్న ఇరాన్ ముందుగా చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై (Israel) దాడికి తెగబడింది. ఇరాన్ సైన్యం సుమారు 200 డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ (Israel) పై దాడులు (attack) చేసింది. ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం అర్ధరాత్రి సమాచారం అందించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరం దెబ్బతింది. ఓ బాలిక సహా అనేక మంది గాయపడినట్లు సమాచారం. ఇదే సమయంలో ఇరాన్ ప్రయోగించిన క్షిపణులలో కొన్నింటిని ఇజ్రాయెల్ పేల్చివేసింది. అలాగే సిరియా, జోర్డాన్‌ల ప్రాంతాల్లో కొన్ని డ్రోన్‌లను కూల్చివేసింది.
న్యూస్ అప్డేట్స్ కోసం WhatsApp చానల్ లో చేరండి..
ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరు తో 200 లకుపైగా కిల్లర్ డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు, క్రూయిజ్ క్షిపణులతో దాడులు చేసింది. ఇవి ఇరాక్ గగనతలం నుంచి ఇజ్రాయెల్ వైపుగా దూసుకెళ్లాయి. అయితే కొన్నింటిని మధ్య ప్రాచ్యంలోని అమెరికా దళాలు మధ్యలోనే కూల్చివేయగా.. మరికొన్నింటిని సిరియా, జోర్డాన్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ నేలమట్టం చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇజ్రాయెల్ ఎయిరో స్పేస్‌పై మరికొన్నింటిని ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకున్నది. దీంతో జెరూసలెంలో ఉన్న అలారాలు ఒక్కసారిగా మార్మోగాయి. తమ భూ భాగంపైకి గగణతలం నుండి గగణతలంలోకి మిస్సైళ్లను ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. అయితే వాటిని అడ్డుకున్నామని పేర్కొంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామని ప్రకటించింది.
ఇజ్రాయెల్ ఎలా పుట్టింది..? యూదుల వలస వెనుక చరిత్ర ఏమిటీ?
Iran Attacks : కాగా ఇరుదేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న దృష్ట్యా ఇజ్రాయెల్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్ తమ గగనతలాలను మూసివేశాయి. సిరియా, జోర్డాన్ దేశాలు తమ వైమానిక దళాలను సైతంం అప్రమత్తం చేశాయి. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్‌పై దాడిని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఖండించారు. మరో యుద్ధాన్ని భరించే స్థితిలో ప్రపంచదేశాలు లేవని తెలిపారు. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని సూచించారు. ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. కాగా ఐరాస చార్టర్‌లోని ఆర్టికల్ 51 ప్రకారమే తాము దాడి చేసినట్లు వెల్లడించింది. మళ్లీ ఇజ్రాయెల్, అమెరికాలు తమపై దాడులు చేస్తే మాత్రం ఈసారి ఊరుకునేదిలేదని, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఇదిలా ఉండగా తాజా దాడుల నేపథ్యంలో ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్న్నానారు. ఇరాన్ జాతీయ జెండాలను పట్టుకుని రోడ్లపై ర్యాలీలు నిర్వహించారు.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో సంప్రదించవచ్చు.