Thursday, April 17Welcome to Vandebhaarath

ISKCON | ఇస్కాన్‌ చిన్మయ్‌ కృష్ణదాస్‌ ప్రభును అదుపులోకి తీసుకున్న బంగ్లా ప్రభుత్వం..!

Spread the love

ISKCON | హిందువులపై జరిగిన అకృత్యాలను నిరసించిన ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్‌ కృష్ణ దాస్‌ ప్రభును బంగ్లాదేశ్ ప్ర‌భుత్వం అరెస్టు చేసింది. ఢాకా నుంచి చిట్టగాంగ్‌ వెళ్లేందుకు ఆయన సోమవారం హజ్రత్‌ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా.. పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చిన్మయ్‌ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ప్రభు బంగ్లాదేశ్‌లోని సనాతన్‌ జాగరణ్‌ మంచ్‌ ప్రతినిధిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అక్టోబర్‌ 30న బంగ్లాదేశ్‌లో జాతీయ జెండాను అవమానించినందుకు గాను చిన్మయ్‌ కృష్ణ దాస్‌ ప్రభుతో సహా 13 మందిపై కేసు నమోదైంది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు.
అక్టోబర్‌ 25న లాల్దిఘి ర్యాలీలో బంగ్లాదేశ్‌ జాతీయ జెండా కంటే ఎత్తున ఇస్కాన్‌కు చెందిన కాషాయరంగు జెండా ఎత్తులో ఎగురవేశారు. ఈ క్రమంలోనే పలువురిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి.

READ MORE  Rail News | రైలు ప్ర‌యాణికుల‌కు ఊర‌ట‌నిచ్చేలా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం

అక్టోబర్‌ నుంచి సనాతన్‌ జాగరణ్‌ మంచ్‌ చిట్టగాంగ్‌లో మైనారిటీల రక్షణ, హక్కులను డిమాండ్‌ చేస్తూ నిరసనలను ప్రారంభించింది. ఈ కార్య‌క్రమాల్లో చిన్మయ్‌ కృష్ణ దాస్‌ ప్రభు పాల్గొని తాత్కాలిక ప్రభుత్వంపై విమర్శలు చేవారు. మైనారిటీలపై నేరాలకు పాల్పడే వ్యక్తులను విచారించేందుకు ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేయాల‌ని, బాధితులకు పరిహారం, పునరావాసం క‌ల్పించాల‌ని, మైనారిటీ రక్షణ చట్టం అమలు చేయాల‌ని, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల‌ని, విద్యాసంస్థలు, హాస్టళ్లలో మైనారిటీలకు ప్రార్థనా స్థలాలు, పూజాగృహాల నిర్మాణంపై డిమాండ్లు చేశారు. హిందూ, బౌద్ధ, క్రైస్తవ, సంక్షేమ ట్రస్టులకు ఆస్తి బదిలీ చట్టం అమలు, పాలీ-సంస్కృత విద్యా మండలి ఆధునీకరణ, దుర్గాపూజ సందర్భంగా ఐదు రోజుల సెలవులను ఇవ్వాలని విజ్ఞ‌ప్తి చేశారు.

READ MORE  Medram app | మేడారం భక్తుల కోసం ప్రత్యేక యాప్.. ఇక అన్ని వివరాలు మీ ఫోన్లోనే..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *