IPL 2025 Mega Auction : రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ తర్వాత, IPL మెగా వేలంలో భారత ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ ప్రకంపనలు సృష్టించాడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్, కుడిచేతి మీడియం బౌలర్ వెంకటేష్ అయ్యర్ వేలంలో సందడి చేశాడు.
వెంకటేష్ అయ్యర్‌ను అతని సొంత జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. వెంకటేష్‌ని మళ్లీ జట్టులోకి తీసుకురావడానికి KKR 23.75 కోట్లు ఖర్చు చేసింది. దీంతో ఈ సీజన్‌లో అత్యంత ఖరీదైన మూడో ఆటగాడిగా వెంకటేష్ నిలిచాడు. అతని కంటే ముందు రిషబ్ పంత్ రూ.27 కోట్లకు, శ్రేయాస్ అయ్యర్ రూ.26.75 కోట్లకు అమ్ముడుపోయారు.