
- భారత మార్కెట్ కోసం సెప్టెంబర్ 12న ప్రీ-ఆర్డర్స్
- ఐఫోన్ 17లో 6.3 ఇంచుల డిస్ప్లే, A19 చిప్‌సెట్
- వీడియో ప్లేబ్యాక్‌లో 8 గంటలు అదనపు బ్యాటరీ లైఫ్
- ఐఫోన్ ఎయిర్ ధర రూ.1,19,900 నుండి ప్రారంభం
ఆపిల్ iPhone 17 సిరీస్ వచ్చేసింది. దీని ధర రూ.82,900 నుండి రూ.2,29,900 మధ్య ఉంటుంది, ఇది సెప్టెంబర్ 19 నుండి భారత్‌లో అందుబాటులో ఉంటుంది. కంపెనీ తన అత్యంత సన్నని ఐఫోన్ ‘ఐఫోన్ ఎయిర్ సిరీస్’ను కూడా ప్రవేశపెట్టింది. ఇది 5.6 మిల్లీమీటర్ల మందంతో eSIM లకు మాత్రమే సపోర్ట్ ఇస్తుంది.
కొత్త ఐఫోన్ మోడళ్లలో 128GB తక్కువ స్టోరేజ్ కెపాసిటీ వేరియంట్ ను కంపెనీ నిలిపివేసింది. దీని వలన ఐఫోన్ 16 సిరీస్‌తో పోలిస్తే బేస్ మోడళ్ల ధర ఎక్కువగా ఉంది. ఐఫోన్ 17 ప్రో రెట్టింపు ఎంట్రీ స్టోరేజ్, 256GB, అలాగే 512GB, 1TB వేరియంట్లలో లభిస్తుంది.
ఐఫోన్ 17 ప్రో మాక్స్ 256GB, 512GB, 1TB, మొదటిసారిగా 2TB స్టోరేజ్ కెపాసిటీలో అందుబాటులో ఉంటుంది. “ఐఫోన్ 17 ప్రో ఇప్పటివరకు అత్యంత అధునాతనమైన ఐఫోన్, ఇది అద్భుతమైన కొత్త డిజైన్, పవర్‌పుల్ ఫీచర్స్ ఉన్నాయి. ” అని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ అన్నారు. కంపెనీ ఐఫోన్ ప్రో సిరీస్‌లో ప్రకాశవంతమైన కాస్మిక్ నారింజ రంగును ఒకటిగా జోడించింది.
“కాస్మిక్ ఆరెంజ్, డీప్ బ్లూ, సిల్వర్ రంగులలో లభించే ఐఫోన్ 17 ప్రో ధర రూ. 1,34,900 నుంచి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,49,900 నుండి ప్రారంభమవుతుంది” అని ఆపిల్ ప్రకటించింది.
భారత్ తో సహా 63 కి పైగా దేశాలలోని వినియోగదారులు సెప్టెంబర్ 12 శుక్రవారం ఉదయం 5 గంటలకు PDT నుండి ఐఫోన్ 17 ప్రో మరియు ఐఫోన్ 17 ప్రో మాక్స్‌ను ముందస్తు ఆర్డర్ చేయవచ్చు, సెప్టెంబర్ 19 శుక్రవారం నుండి లభ్యత ప్రారంభమవుతుంది” అని ప్రకటన తెలిపింది.
“ఐఫోన్ 17 లావెండర్, మిస్ట్ బ్లూ, సేజ్, వైట్ మరియు బ్లాక్ రంగులలో 256GB మరియు 512GB స్టోరేజ్ కెపాసిటీలలో లభిస్తుంది. ఐఫోన్ 17 రూ. 82,900 నుండి ప్రారంభమవుతుంది” అని ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఐఫోన్ 17 లైనప్ మూడు మోడళ్లలో ప్రారంభించబడింది – ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్, మునుపటి సిరీస్‌ల మాదిరిగా కాకుండా “ప్లస్” మోడల్ కూడా ఉంది. బేసిక్ ఐఫోన్ 17 మునుపటి వెర్షన్లలోని “ప్లస్” సిరీస్ మోడల్‌ల మాదిరిగానే 256 GB మినిమం స్టోరేజ్ సామర్థ్యంతో ప్రారంభమవుతుంది. ఇది భారతదేశంలో రూ.82,900 ప్రారంభ ధరతో లభిస్తుంది, ఐఫోన్ 16 ప్లస్ అదే స్టోరేజ్ తో ధర రూ.89,900 నుంచి ప్రారంభమవుతుంది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్ డిస్ప్లే సైజులు వరుసగా 6.1 అంగుళాలు, 6.7 అంగుళాలు ఉండగా, ఐఫోన్ 17 డిస్ప్లే సైజు 6.3 అంగుళాలు.
iPhone 17లో 6.3 ఇంచుల డిస్ప్లే, A19 చిప్‌సెట్
ఐఫోన్ 17లోని A19 చిప్‌సెట్ ఐఫోన్ 16 కంటే 20 శాతం, ఐఫోన్ 15తో పోలిస్తే 80 శాతం, ఐఫోన్ 14 నుండి 90 శాతం మరియు ఐఫోన్ 13తో పోలిస్తే రెట్టింపు వేగంతో పనిచేస్తుందని పంచుకున్నారు. ఐఫోన్ 16 తో పోలిస్తే ఐఫోన్ 17 8 గంటలు ఎక్కువ వీడియో ప్లేబ్యాక్‌కు మద్దతు ఇస్తుందని, 10 నిమిషాల ఛార్జింగ్ పరికరంలో 8 గంటల వరకు వీడియోను సపోర్ట్ చేయగలదని ఆమె అన్నారు.
ఐఫోన్ ఎయిర్ సిరీస్ 256 GB నుండి 1TB స్టోరేజ్ వరకు స్టోరేజ్ ఆప్షన్లతో రూ. 1,19,900 ప్రారంభ ధరకు వస్తుంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.