Thursday, November 21Thank you for visiting
Shadow

Inner Ringroad Case : గురి.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్

Inner Ringroad Case: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంలో లోకేష్ ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఏపీ సిఐడి నిందితుడిగా చేర్చడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Nara lokesh In Inner Ringroad Case: ఆంధ్రప్రదేశ్ అమరావతి (Amravathi) ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా నారా లోకేశ్ (Nara Lokesh))  పేరును చేర్చింది. ఈమేరకు నారా లోకేశ్ పేరును చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలైంది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమ వ్యక్తిగత ఆస్తుల విలువను పెంచుకోడానికి ఇన్నర్‌ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్లను మార్చారని సిఐడి(CID) ఆరోపణలు చేస్తోంది.

READ MORE  Heavy Rains | తెలంగాణలో ప‌లు జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌.. ఇక‌ ఐదురోజులు వర్షాలే..

సింగపూర్‌ కన్సల్టెన్సీకి మాస్టర్‌ ప్లాన్ తయారు చేసే బాధ్యతలను అప్పగించి, అందులో నిబంధనలను తమకు అనుగుణంగా మార్చుకున్నారని సీఐడీ అభియోగాలు మోపింది. ఇన్నర్‌ రింగ్‌ అలైన్‌మెంట్‌ వ్యవహారంలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, ప్రముఖులు భూముల విలువను అమాంతం పెంచుకునేందుకు అలైన్‌మెంట్‌ లో మార్పులు జరిగాయని సీఐడీ ఆరోపిస్తోంది.

హెరిటేజ్ భూములకు సమీపంగా రింగ్ రోడ్డు వెళ్లేలా దక్షిణం వైపునకు జరిపారని, విజయవాడ నగరంలో మాజీ మంత్రి నారాయణ(Narayana) కు చెందిన భూముల విలువ పెరిగేలా మార్పులు చేశారని సీఐడీ ఆరోపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన పలువురి ప్రమేయం ఉందని చెబుతోంది. ఈ మేరకు కేసులో ఏ14గా నారా లోకేష్‌ పేరును చేర్చారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu Naidu) అరెస్ట్ అయిన తర్వాత టీడీపీలో కీలకంగా ఉన్న నారా లోకేష్‌ను కూడా అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ1 గా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు, ఏ2గా నారాయణ తో పాటు లింగమననేని రమేష్, బిల్డర్ అంజనీకుమార్‌ లు ఉన్నారు. తాజాగా ఈ వ్యవహారంలో లోకేష్‌ పేరును కూడా చేర్చడం జరిగింది. ఇదిలాఉండగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసును క్వాష్‌ చేయాలని మాజీ మంత్రి నారాయణ వేసిన పిటిషన్‌ను హైకోర్టు అక్టోబరు 3వరకు వాయిదా వేసింది.

READ MORE  Cabinet Meeting | మరింత పవర్ ఫుల్ గా హైడ్రా.. భారీగా సిబ్బంది కేటాయించిన సర్కారు..  

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *