Hydrogen Train : రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో త్వరలోనే హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. భారతీయ రైల్వే శాఖ డిసెంబర్ 2024లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించనుంది,
హైడ్రోజన్ రైళ్ల ప్రత్యేకత ఏంటి?
హైడ్రోజన్ రైళ్లకు ఎన్నో ప్రత్యకతలు ఉన్నాయి. సంప్రదాయ రైళ్ల మాదిరిగా ఇవి నడిచేందుకు డీజిల్ లేదా విద్యుత్ అవసరం లేదు. ఇందులో శక్తిని ఉత్పత్తి చేయడానికి నీటిని ప్రాథమిక వనరుగా ఉపయోగించుకుంటాయి. అలాగే రైలుకి అవసరమైన విద్యుత్‌ను సైతం హైడ్రోజన్ ద్వారా తయారు చేసుకోవటం ఈ రైళ్ల ప్రత్యేకత, హైడ్రోజన్ రైళ్లతో కాలుష్యమనే మాటే ఉండదు. డీజిల్, ఎలక్ట్రికల్ రైళ్ల కంటే కూడా జీరో పొల్యూషన్ తో నడుస్తాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ హైడ్రోజన్ రైళ్లను అన్నిదేశాలూ తీసుకువొస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ లోనూ హైడ్రోన్ రైలు పట్టాలు ఎక్కబోతున్నది.
భారతదేశంలో హైడ్రోజన్ రైలు ఎందుకు?
హైడ్రోజన్ రైలు కార్బన్ ఫుట్‌ప్రింట్‌ను తగ్గించడానికి, డీజిల్ ఇంజిన్‌ల వల్ల కలిగే వాయు కాలుష్యాన్ని తొలగించేందుకు ప్రవేశపెడుతోంది.హైడ్రోజన్‌తో రైలును కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్‌లు, ఇతర కాలుష్యక కారకాలను విడుదల చేయవు. ఇది అందుబాటులో ఉన్న అత్యంత స్థిరమైన రవాణా మార్గాలలో ఒకటిగా నిలుస్తుంది.
Hydrogen Train రూట్, టాప్ స్పీడ్..
హరియాణాలోని జింద్-సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే, కల్కా-సిమ్లా రైల్వే, భారతదేశంలోని మరిన్ని ప్రాంతాల్లో ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కాగా హైడ్రోజన్ రైలు గరిష్టంగా 140 km/h వేగంతో దూసుకెళ్తుంది. ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.
దేశవ్యాప్త విస్తరణ
కాగా హైడ్రోజన్ ట్రెయిన్ ట్రయల్ రన్ విజయవంతమైన తర్వాత, భారతీయ రైల్వే తన హైడ్రోజన్ రైలు సేవలను దేశంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించాలని యోచిస్తోంది, 2025 నాటికి 35 హైడ్రోజన్ రైళ్లు వివిధ మార్గాల్లో నడపాలని భావిస్తున్నారు. ఈ హైడ్రోజన్ రైలు స్పీడ్ ఏ మాత్రం తక్కువ కాదు. టాప్ స్పీడ్ 140 కిలోమీటర్లు. హైడ్రోజన్ తో నడిచే రైళ్లతో జీరో పొల్యూషన్ ఉండటమే కాకుండా.. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని రైల్వే శాఖ చెబుతోంది. భారతదేశంలో మొదటి హైడ్రోజన్ రైలు.. హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మార్గంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ స్టేషన్ల మధ్య దూరం 90 కిలోమీటర్లు. ఇప్పటికే ట్రయిల్ రన్ విజయవంతమైంది. ఈ స్టేషన్ల మధ్యనే కాకుండా.. డార్జిలింగ్, నీలగిరి మౌంటైన్, కల్కా.. సిమ్లా రైల్వే వంటి హిల్.. పర్వత ప్రాంతాలకు ఈ హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. హైడ్రోజన్ రైళ్ల ట్రయిల్ రన్ విజయవంతం కావటంతో.. 2024 డిసెంబర్ నెలలోనే అధికారికంగా మొదటి హైడ్రోజన్ రైలును పట్టాలెక్కనుంది. 2025లో 35 హైడ్రోజన్ రైళ్లు నడపాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.