Wednesday, December 18Thank you for visiting
Shadow

CAPF Jobs : కేంద్ర సాయుధ బలగాల్లో ఉద్యోగాల భర్తీపై కేంద్రం కీలక ప్రకటన

Spread the love

Indian Armed Forces : కేంద్ర సాయుధ బలగాలు, (CAPF Jobs) అస్సాం రైఫిల్స్‌ లో ఉద్యోగాల భర్తీపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర సాయుధ బలగాల్లో  ఏకంగా లక్షకు పైనే ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. గత ఐదు సంవత్సరాల్లో సుమారు  71,231 పోస్టులు భర్తీ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న సీఏపీఎఫ్‌, ఏఆర్‌ ఉద్యోగాల్లో చాలా వరకు పదవీ విరమణలు, రాజీనామాలు, పదోన్నతులు, మరణాలు, కొత్త బెటాలియన్‌ ఏర్పాటు వంటి  కార‌ణాల‌తో ఖాళీలు ఏర్పడినట్లు తెలిపారు. విభాగాల వారీగా అక్టోబర్‌ 30 నాటికి ఉద్యోగాల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

  • సీఏపీఎఫ్‌, ఏఆర్‌లో మొత్తంగా 1,00,204 పోస్టులు
  • సీఆర్‌పీఎఫ్‌లో 33,730
  • సీఐఎస్‌ఎఫ్‌లో 31,782
  • బీఎస్‌ఎఫ్‌లో 12,808
  • ఐటీబీపీలో 9,861
  • ఎస్‌ఎస్‌బీలో 8,646
  • అస్సాం రైఫిల్స్‌లో 3377 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
READ MORE  Mega DSC 2024 : మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలయ్యేది ఈ తేదీలోనే !

యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ ద్వారా ఈ ఖాళీలను త్వరితగతిన భర్తీ చేసేందుకు మంత్రిత్వశాఖ చర్యలు తీసుకుంటుందని మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. ఈ నియామక ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు. ఇందుకోసం  వైద్య పరీక్షలకు సంబంధించి సమయాన్ని తగ్గిస్తామని, కానిస్టేబుల్‌ జీడీ కోసం షార్ట్‌ లిస్ట్‌ అయిన అభ్యర్థుల కటాఫ్‌ మార్కులను తగ్గించనున్నామనితెలిపారు.
ఇక కేంద్ర సాయుధ బలగాల్లోని సిబ్బంది శ్రేయస్సుకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సీఏపీఎఫ్‌ సిబ్బందికి ఏడాదిలో 100 రోజులు వారంతా కుటుంబంతో గడిపేలా మంత్రిత్వశాఖ కృషి చేస్తున్నదని చెప్పారు. 2020 నుంచి 2024 అక్టోబరు వరకు 42,797 మంది సీఏపీఎఫ్‌, ఏఆర్‌ సిబ్బంది 100 రోజుల సెలవులు వినియోగించుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

READ MORE  New Criminal Justice | కొత్త క్రిమినల్ చట్టాలతో దేశం పురోగమిస్తుంది.. జస్టిస్ డీవై చంద్రచూడ్..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *