అక్రమంగా లింగనిర్ధారణ చేస్తున్న ముఠా అరెస్టు

అక్రమంగా లింగనిర్ధారణ చేస్తున్న ముఠా అరెస్టు
  • అబార్షన్ల కోసం ప్రైవేట్ ఆస్పత్రులతో కుమ్మక్కు
  • రూ.20వేల నుంచి 30వేల వసూలు
  • 18 మంది నిందితులను అరెస్టు చేసిన వరంగల్ కమిషనరేట్ పోలీసులు
  • వివరాలు వెల్లడించిన సీపీ రంగనాథ్

ఎలాంటి వైద్య అర్హతలు లేకున్నా లింగనిర్ధారణ పరీక్షలు చేసి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠాను సోమవారం  యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్స్ కేయూసీ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్ (Gopalpur)లో గల వెంకటేశ్వరా కాలనీలో ఈ ముఠాకు చెందిన 18 మందిని అరెస్టు చేయగా మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి నుంచి మూడు లింగనిర్ధారణకు వినియోగించే స్కానర్లు, 18 సెల్ ఫోన్లు, రూ.73వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, బాల్నె పార్ధు, మోరం అరవింద, మోరం శ్రీని వాస్ మూర్తి, బాల్నె పూర్ణిమ, వార్ని ప్రదీప్ రెడ్డి, కైత రాజు, కల్లా అర్జున్, డి. ప్రణయ్ బాబు, కీర్తి మోహన్, బాల్నె అశలత, కొంగర రేణుక, భూక్యా అనిల్, చెంగెల్లి జగన్, గన్నారపు శ్రీలత బండి నాగరాజు, కాసిరాజు దిలీప్ ఉన్నారు. మరికొందరు నిందితు లు పరారీలో ఉన్నారు.
కాగా ఈ అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ వివరాలను వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లింగనిర్ధారణకు పాల్పడుతూ పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకొని, అడపిల్ల అయితే గర్భస్రావానికి పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులు వచ్చాయి. యాంటీ హ్యూమన్ ట్రాఫి కింగ్, టాస్క్ ఫోర్స్, జిల్లా వైద్యవిభాగాలతో ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడైన వేముల ప్రవీణ్ గతంలో స్కానింగ్ కేంద్రంలో టెక్నీషయన్ గా పనిచేశాడు. గతంలో అక్రమంగా లింగనిర్ధారణ పాల్ప డటంతో హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. మరోమారు మేముల ప్రవీణ్ సుల భంగా డబ్బు సంపాదించాలనుకొని తన భార్య సంధ్యారాణితో కలిసి కేయూ పీఎస్ పరిధిలోని గోపాల్ పూర్ వెంకటేశ్వర కాల నీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని గర్భిణులకు లింగనిర్ధారణ చేసేందుకు కొందరు సిబ్బందితో పోర్టబుల్ స్కానర్ల సహాయం తో స్కానింగ్ కేంద్రాన్ని రహస్యంగా నిర్వహిస్తున్నారు.

READ MORE  రాజస్థాన్ లో ఘోరం: మహిళను వివస్త్ర చేసి ఊరేగించిన భర్త, అత్తమామలు

ఆర్ఎంపీలు, ప్రైవేట్ ఆస్పత్రులతో కలిసి నెట్వర్క్

నిందితుడు వేముల ప్రవీణ్ ఆర్ఎంపీలు, పీఆర్ఓలు, హాస్పిటల్ మెనేజ్ మెంట్, సిబ్బంది, డాక్టర్లతో కలిసి ఒక నెట్వర్క్ గా ఏర్పాటుకున్నాడు. ప్రవీణ్ తన స్కానింగ్ సెంటర్ కు లింగ నిర్ధారణకు వచ్చే మహిళలకు లింగనిర్ధారణ పరీక్షలు చేసి పుట్టబోయే బిడ్డ గురించి తెలుసుకొని ఆడపిల్ల అయితే గర్భస్రావం కోసం ఈ ముఠాకు చెందిన హాస్పిటల్స్.. హనుకొండ లోని లోటస్ హాస్పిటల్, గాయత్రి హాస్పి టల్, నెక్కొండలోని ఉపేందర్ (పార్థు)హాస్పటల్, నర్సంపేటలోని బాలాజీ మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్లో గర్భిణులకు డాక్టర్లు, సిబ్బంది అక్రమంగా గర్భస్రావాలను చేసే వారు. ఇందుకోసం బాధితుల నుంచి ఫీజు ల రూపంలో వసూలు చేసిన డబ్బులను ఈ ముఠా సభ్యులు కమీషన్ల రూపంలో వాటాలు పంచుకునేవారు. ఒక్కోక్క గర్భస్రావానికి రూ.20,000 నుంచి రూ.30,000 వరకు వసూలు చేసేవారు, ఇప్పటివరకు ఈ ముఠా వందకు పైగా గర్భస్రావాలు చేసినట్లు గుర్తించారు. ముఠాను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన అదనపు డీసీపీలు పుష్ప, టాస్క్ ఫోర్స్ డీసీపీ జితేందర్ రెడ్డి, ఇన్స్ స్పెక్టర్లు సుజాత, శ్రీనివాస్ రావు, జనార్దన్ రెడ్డి, వినయ్ కుమార్, ఎస్ఐలు ఫసీయుద్దీన్, మల్లేశం, శరత్ కుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, ఏహెచ్ టీయూ సిబ్బంది ఎఎస్ఐ భాగ్యలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ సమీయుద్దీన్, కానిస్టేబుళ్లను వరంగల్ పోలీస్ కమిసనర్ రంగనాథ్ అభినందించారు.

READ MORE  పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి సూత్రధారి షాహిద్‌ లతీఫ్‌ పాక్‌లో గుర్తు తెలియని దుండగుల చేతిలో హతం..

Electric Vehicles అప్‌డేట్‌ల కోసం హరితమిత్రను చూస్తూ ఉండండి, తాజా తెలుగు వార్తల కోసం మా వందేభారత్ వెబ్ సైట్,

టెక్ వార్తల కోసం టెక్ ఈనాడును సందర్శించండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *