Illegal Migrants : న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల కారణంగా రాజధానిలో పెరుగుతున్న ఆందోళనలను పరిష్కరించడానికి ఢిల్లీ పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. సరైన పత్రాలు లేకుండా నివసిస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని వెంటనే వారి స్వదేశానికి తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఈ డ్రైవ్‌లో భాగంగా బంగ్లాదేశ్ నుంచి ఎనిమిది మంది అక్రమ వలసదారులను ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO) ద్వారా గుర్తించి వారి దేశానికి పంపించినట్లు పోలీసులు తెలిపారు.
అటవీ మార్గం ద్వారా వలసలు
Illegal Migrants in india బంగ్లాదేశ్ జాతీయులను జహంగీర్, అతని భార్య పరినా బేగం, వారి ఆరుగురు పిల్లలుగా గుర్తించారు. అందరూ రంగపురిలో నివాసం ఉండేవారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాను బంగ్లాదేశ్‌లోని ఢాకాకు చెందినవాడినని జహంగీర్ అంగీకరించాడు. అతను అటవీ మార్గాలు, ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించి ఇక్కడే ఉంటున్నాడు.
ఢిల్లీలో స్థిరపడిన తర్వాత తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లి తన భార్య పరినా బేగంను తన ఆరుగురు పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చాడు. వారు తమ అసలు గుర్తింపును దాచిపెట్టి ఢిల్లీలోని సౌత్ వెస్ట్‌లోని రంగపురి ప్రాంతంలో నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు.
వెరిఫికేషన్ డ్రైవ్ సమయంలో వారిని చూసి పోలీసులు అనుమానించారు. దీంతో తదుపరి విచారణలో వారు బంగ్లాదేశ్‌కు చెందినవారని, వారి బంగ్లాదేశ్ ఐడిలను ధ్వంసం చేశారని గుర్తించారు. వెరిఫికేషన్, దర్యాప్తు ఫలితాల ఆధారంగా తగిన చట్టపరమైన చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
రాజధానిలో ముమ్మర తనిఖీలు
bangladeshi Illegal Migrants : స్పెషల్ డ్రైవ్ లో భాగంగా, ఢిల్లీ పోలీసులు నైరుతి జిల్లా అంతటా తనిఖీలను నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషన్ల అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు, ప్రత్యేక విభాగాలు క్షుణ్ణంగా సోదాలు నిర్వహించి, పత్రాలు లేని వలసదారులను గుర్తించేందుకు నిఘాను సేకరించాయి. వెరిఫికేషన్ డ్రైవ్ సందర్భంగా డోర్ టు డోర్ వెరిఫికేషన్స్ నిర్వహించి దాదాపు 400 కుటుంబాలను తనిఖీ చేసి వారి పత్రాలను సేకరించారు. వెరిఫికేషన్ ఫారమ్‌లు (పార్చా-12) వెరిఫికేషన్ కోసం పశ్చిమ బెంగాల్‌లోని వారి సంబంధిత చిరునామాలకు పంపబడ్డాయి.అనుమానితుల మాన్యువల్ వెరిఫికేషన్ కోసం ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేసి పశ్చిమ బెంగాల్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..