Sunday, April 27Thank you for visiting

Illegal immigrant : గుజరాత్‌లో 1000 మంది అక్రమ వలసదారులు అదుపులోకి..!

Spread the love


Ahmadabad : జమ్మూ కశ్మీర్‌లో జరిగిన పాశవిక ఉగ్రదాడితో భారత ‌ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే దేశంలోని అన్ని రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ ‌నగరవ్యాప్తంగా శనివారం క్రైమ్‌ ‌బ్రాంచ్‌ అధ్వర్యంలో క్షుణ్ణంగా అనువణువు సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 400 మందికిపైగా అనుమానాస్పద వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 127 మంది బంగ్లా దేశీయులు అక్రమంగా దేశంలో నివసిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. విచారణ అనంతరం వారివారి ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించామని అహ్మదాబాద్‌ – ‌బ్రాంచ్‌ ‌డీసీపీ అజిత్‌ ‌రాజియన్‌ ‌మీడియాకు వెల్లడించారు.

READ MORE  Arvind Kejriwal | కేజ్రీవాల్ లేఖపై బిజెపి కౌంట‌ర్‌.. ఆర్ఎస్ఎస్‌ నుంచి 'సేవా స్ఫూర్తి' నేర్చుకోండి

అహ్మదాబాద్‌ ‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీ వలసదారులను (Illegal immigrant) పట్టుకోవడానికి ఈ కూంబింగ్‌ ఆపరేషన్‌ ‌నిర్వహించినట్లు డీసీపీ వివరించారు. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. దీంతో భారత్‌, ‌పాకిస్థాన్‌ ‌దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు పోటా పోటీగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి . అలాంటి వేళ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న పాకిస్థాన్‌ ‌జాతీయులను వెంటనే వెనక్కి పంపాలని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొంది.
దాంతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ ‌షా.. శుక్రవారం దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో టెలి కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. ఆయారాష్ట్రాల్లో నివసిస్తున్న అక్రమ వలసదారులు మరి ముఖ్యంగా పాకిస్థానీయులను గుర్తించి.. వారిని వెంటనే పాకిస్థాన్‌ ‌పంపాలని వారిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. మరోవైపు పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్థాన్‌ ‌ప్రమేయం ఉందని భారత్‌ ‌తగిన ఆధారాలను సేకరించింది. అందుకు సంబంధించిన ఆధారాలను భారత్‌లోని పలు దేశాల రాయబారులకు భారత విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్‌ ‌మిస్రీ అందజేసిన విషయం విదితమే.

READ MORE  ‘Naya Kashmir’ Bills | పీవోకే ముమ్మాటికీ మనదే.. 24 సీట్లు రిజర్వ్‌ చేశాం : అమిత్‌ షా

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..