Sunday, April 12, 2026
Telangana

హైదరాబాదీలకు గుడ్ న్యూస్ : మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్..

Spread the love

Hyderabad Metro Rail Second Phase Update | హైదరాబాద్‌లో కొత్త మెట్రో మార్గాల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కు పరిపాలన పరమైన అనుమలు ఇస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.  ఐదు రూట్ల మేర 76.4 కిలోమీటర్ల పొడవుతో ఈ మెట్రో లైన్ ను నిర్మించనున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు 40 కిలో మీటర్ల మేర మెట్రో లైన్ నిర్మాణం పార్ట్ B ఆరో రూట్ గా ఉంది. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ లో విస్తరణలో మొత్తం 116.4 కిలో మీటర్ల పొడవు కొత్తగా మెట్రో ట్రైన్లు ప్రజలకు సేవలందించనున్నాయి. ఇందుకోసం రూ.24.269 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నట్లు  ప్రభుత్వం పేర్కొంది.

ఐదు కారిడార్లు

  • నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ : 36.8 కిలో మీటర్లు
  • రాయ్ దుర్గం నుంచి కోకాపేట్ : 11.6 కి.మీ
  • MGBS నుంచి ఓల్డ్ సిటీ : 7.5 కి.మీ
  • మియా పూర్ నుంచి పటాన్ చెర్వు ; 13.4 కి.మీ
  • ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ : 7.1 కి.మీ

పార్ట్ B

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి పోర్త్ సిటీ స్కిల్ యూనివర్సిటీ వరకు : 40 కిలోమీటర్లు

Hyderabad Metro Rail Second Phase Update : ఐదు రూట్లు, పార్ట్ B కలిపి మొత్తం 116.4 km కొత్తగా హైదరాబాద్ మెట్రో విస్తరించనుంది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకోసం రూ.24.269 వేల కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నారు. పార్ట్‌-బి లో నిర్మించనున్న శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 40 కిలో మీటర్ల మార్గానికి సర్వే జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది. కారిడార్ 4లో నాగోలు- శంషాబాద్ విమానాశ్రయం వరకు 36.8 కిలో మీటర్లు, కారిడార్ 5లో రాయదుర్గ- కోకాపేట నియోపోలీస్ వరకు 11.6 కిలో మీటర్లు, కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రయాణగుట్ట వరకు 7.5 కి.మీ, కారిడార్ 7లో మియాపూర్ నుంచి పటాన్ చెరువు వరకు 13.4 కి.మీ, కారిడార్ 8లో ఎల్బీనగర్ నుంచి హయత్​నగర్ వరకు 7.1 కి.మీ నిర్మించనున్నట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మెట్రో రైలు రెండో దశ పార్ట్-బిగా కారిడార్ 9లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్ వర్సిటీ వరకు మెట్రో రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *