Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో స్టేషన్లు ఇవేనా..!
Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు గత ప్రభుత్వం మెట్రో రైల్ సర్వీస్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదటి దశలో మెట్రోకు ప్రజల నుంచి భారీ స్పందన రావడంతో రెండో దశ మెట్రో లైన్ ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో అత్యంత కీలకమైన, ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా ఉన్న పలు మార్గాల్లో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని సంస్థను ఆదేశించింది. ఈ క్రమంలో నాగోల్ నుంచి చాంద్రాయన గుట్ట వరకు దాదాపు 14 కిలో మీటర్ల మెట్రోను నిర్మించేందుకు రూట్ ను ఖరారు చేసిట్లు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో మార్గాన్ని పొడిగించే విధంగా ఈ రూట్ మ్యాప్ ను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ లైన్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ప్రారంభమై నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని హాస్పిటల్, ఎల్బీనగర్ సర్కిల్, సాగర్ రింగ్ రోడ్, మైత్రి నగర్ మీదుగా చాంద్రాయన గుట్ట వరకు మొత్తం 14 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ రూట్ మ్యాప్ కు ప్రభుత్వం ఖరారు చేసి లాండ్ పుల్లింగ్ చేస్తే.. అతి త్వరలోనే మెట్రో రెండో దశ పనులు మొదలుకానున్నాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.. ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..
One thought on “Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశలో స్టేషన్లు ఇవేనా..!”