
Hyderabad Metro : హైదరాబాద్: న్యూ ఇయర్ వేడుకల (New year 2025) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైలు కీలక ప్రకటన చేసింది. రేపు, డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు మెట్రో సేవలను పొడిగించినట్లు పేర్కొంది. చివరి రైలు స్టేషన్ నుంచి 12:30 AMకి బయలుదేరుతుంది, అర్ధరాత్రి 1:15 AM వరకు రైలు చివరి గమ్యస్థానానికి చేరుకుంటుందని తెలిపింది. కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకునే వారికి సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాలను అందిస్తున్నట్లు పేర్కొంది.
ఈ మేరు హైదరాబాద్ మెట్రో మేనేజింగ్ డైరెక్టర్, NVS రెడ్డి సోమవారం మాట్లాడుతూ అన్ని టెర్మినల్ స్టేషన్ల నుండి చివరి మెట్రో రైలు 12:30 గంటలకు బయలుదేరి, జనవరి 1, 2025 న తెల్లవారుజామున 1:15 గంటలకు సంబంధిత ఎండ్ పాయింట్లకు చేరుకుంటుంది. ఈ మెట్రో సేవల విస్తరణతో అర్థరాత్రి వేళ ప్రయాణికులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు.
లేట్ నైట్ సమయాల్లో కూడా ప్రయాణీకులు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చని భరోసా ఇచ్చారు. మరోవైపు Hyderabad Metro ప్రయాణికులకు ప్రయాణ భారాన్ని తగ్గించగలదని తెలిపారు. కాగా న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చే అవకాశం ఉంది. నగరంలో సంగీత కచేరీలు, ఇతర నూతన సంవత్సర వేడుకలకు హాజరయ్యే వారు సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవచ్చు..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..