Hyderabad | భాగ్యనగరంలో ట్రాఫిక్ ఇక్కట్లను అధిగమించేందుకు శరవేగంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు నగరవాసులు ఇప్పుడు మెట్రో రైళ్ల వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో హైదరాబాద్ మెట్రో రైళ్ల (Hyderabad Metro Rail)పై అధిక భారం పడుతోంది. ప్రతీరోజు మెట్రో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కనీసం నిలుచోవడానికి కూడా స్థలం ఉండడం లేదు. ఇక సీట్ల సంగతి మర్చిపోవాల్సిందే.. బిజినెస్ వేళల్లో ప్రయాణికుల కష్టాలు చెప్పలేం. ఈ క్రమంలోనే మెట్రో ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
హైదరాబాద్ మెట్రో కోచ్ ల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు ఎప్పటి నుంచో ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ప్రభుత్వం ఈ విషయంపై స్పందించింది. మెట్రో ప్రయాణికుల రద్దీ గురించి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar babu) అసెంబ్లీలో ప్రస్తావించారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం మెట్రో రైలు కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు 3 కోచ్‌లతో పరుగులు పెడుతోంది. దీంతో రద్దీని తగ్గించేందుకు అదనంగా కోచ్‌లను జత చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మెట్రోను 3 కోచ్‌లతో నడిపేందుకు డిజైన్ చేశారని, కానీ దానిని 6 కోచ్‌లుగా మార్చాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే మెట్రో రైలును ఆరు కోచ్‌లుగా అప్‌గ్రేడ్ చేసేందుకు మెట్రో అధికారులు, ఎల్ అండ్ టీ(L&T) యాజమన్యంతో సంప్రదింపులు జరుపుతున్నామని వెల్లడించారు. ఇక కోచ్‌ల పెరిగితే, మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు.
Also Read : జనరల్ క్లాస్ రైలు ప్రయాణికులకు శుభవార్త: కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లలో 10 జనరల్ కోచ్‌లు
హైదరాబాద్ మెట్రో రికార్డులు
- hyderabad metro Records హైదరాబాద్ మెట్రో ప్రతిరోజు 5 లక్షల మందికి పైగా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తోంది
- ఏడేళ్ల క్రితం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో రైలులో ఇప్పటి వరకు 63 కోట్ల మందికి పైగా ప్రయాణించారు.
- సగటున ప్రతిరోజు 4.75 లక్షల మంది మెట్రో ప్రయాణం చేస్తున్నారు.
- గరిష్టంగా 5.63 లక్షల మంది ప్రయాణికులుగా ప్రయాణించిన రికార్డునమోదైంది.
- మెట్రో ప్రాజెక్టుల్లో దిల్లీ మెట్రో ప్రథమ స్థానంలో ఉంటే.. హైదరాబాద్ మెట్రో మూడవ స్థానంలో కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..