మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్.. కేవలం 8.30 గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరుకు..
హైదరాబాద్: మరికొద్ది రోజుల్లో తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు (Vande Bharat Express) ప్రారంభం కానుంది. హైదరాబాద్, బెంగళూరు(Bengaluru) నగరాలను వందేభారత్ ఎక్స్‌ప్రెస్ అనుసంధానం చేసేందుకు భారతీయ రైల్వే సన్నాహాలు చేస్తోంది. .
సెప్టెంబర్ 24న ఢిల్లీ నుంచి కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందే భారత్‌ను ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. మరుసటి రోజు సెప్టెంబర్ 25 నుంచి పూర్తిస్థాయిలో రాకపోకలు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలిపారు.
కాచిగూడ స్టేషన్‌లో జరిగే కార్యక్రమానికి ఈ కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తోపాటు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు నగరాల మధ్య మధ్య 609 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 8 గంటల 30 నిమిషాల్లో కవర్ చేస్తుంది.
రైలు నెంబరు 20703 కాచిగూడ – యశ్వంత్‌పూర్(Yeswantpur ) కాచిగూడ( Kacheguda )లో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌కు చేరుకుటుంది. ఈ రైలు మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపూర్‌లలో ఆగుతుంది.
తిరుగు ప్రయాణంలో రైలు నెంబరుతో 20704 యశ్వంత్‌పూర్ – కాచిగూడ , యశ్వంత్‌పూర్‌లో మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరి రాత్రి 11:15 గంటలకు కాచిగూడ() రైల్వేస్టేషన్ కు చేరుకుంటుంది.
సెప్టెంబర్ 24న తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రారంభించే అవకాశం ఉంది. వీటిలో విజయవాడ-చెన్నై వందే భారత్ కూడా ఉంది. ఈ రైలు గురువారం మినహా వారంలో అన్ని రోజులు నడపబడుతుంది.
విజయవాడ – చెన్నై వందేభారత్ ఎక్స్ ప్రెస్
విజయవాడ – చెన్నై వందేభారత్ ఎక్స్ ప్రెస్ విజయవాడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలలో ఆగుతూ మధ్యాహ్నం 12.10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో చెన్నై నుంచి మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది.
రైల్వే అధికారుల ప్రకారం, కొత్త వందే భారత్ రైళ్లలో ప్రయాణీకుల కోసం మెరుగైన సౌకర్యాలతోపాటు అనేక కొత్త ఫీచర్లను పొందుపరిచారు.
భారతీయ రైల్వేలో ప్రస్తుతం, 25 రూట్లలో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో 120 శాతం ఆదరణతో రెండు రెండు రూట్లలో విజయవంతంగా నడుస్తున్నాయి. అందుల సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్ రైలుతోపాటు సికింద్రాబాద్-విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఉంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లోనూ సంప్రదించవచ్చు.