Thursday, December 19Thank you for visiting
Shadow

HYD Metro | రెండో దశ మెట్రో ప్రాజెక్టు డీపీఅర్ సిద్ధం!

Spread the love

HYD Metro | హైదరాబాద్‌ మెట్రో రైల్‌ రెండో దశ పనులకు రాష్ట్ర ప్ర‌భుత్వం త్వరలోనే శ్రీకారం చుట్టనుంది. ఇందుకు సంబంధించిన ప‌నుల‌ను ఆరు కారిడార్లుగా విభజించగా.. ఐదు కారిడార్లకు డీపీఆర్‌లు రెడీ అయ్యాయ‌ని మెట్రోరైల్ ఎండి ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ – ప్రైవేట్‌ భాగస్వామ్యంతో మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ విస్తరణకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే, దేశంలోనే మూడో అతి పెద్ద మెట్రో నెట్ వ‌ర్క్ గా హైదరాబాద్‌ మెట్రో అవతరిస్తుందని ఆయ‌న తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో హైదరాబాద్‌ మెట్రో రైలు స‌క్సెస్ ఫుల్‌గా నడుస్తోందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉంద‌ని, ప్రపంచంలోనే ఏడేళ్లు పూర్తి చేసుకున్న అతి పెద్ద మెట్రో రైలు ప్రాజెక్ట్‌గా అరుదైన ఘ‌న‌త‌ను సంపాదించుకుందని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు.

READ MORE  Raitu RunaMafi | తెలంగాణలో రెండో విడత రైతు రుణమాపీ ఎప్పుడంటే..

ముంబై, చెన్నైలో లక్షల కోట్లు ఖర్చు చేసి మెట్రో రైల్‌ ప్రాజెక్టును విస్తరిస్తున్నారని దురదృష్టవశాత్తు మన నగరంలో విస్తరణ లేక‌పోవ‌డంతో హైద‌రాబాద్‌ మూడవ స్థానంలో ఉంద‌న్నారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్‌ రెండోదశ ప్రాజెక్టు విస్తరణపై సుదీర్ఘంగా చర్చించామని పేర్కొన్నారు. రెండో దశ ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం అత్యంత ప్రధాన్యనిస్తోందని తెలిపారు. మొత్తం 57 స్టేషన్లతో ప్రపంచంలొనే పీపీపీ మోడ్‌లో అతిపెద్ద నెట్‌వర్క్‌తో రూ.22 వేల కోట్లతో అందుబాటులో ఉందని అన్నారు. హైదరాబాద్‌ మెట్రో మూడు కారిడార్లు విమానాశ్రయానికి కలిసేలా రెండో దశ ప్రాజెక్టులో ఐదు కారిడార్లకు డీపీఆర్‌ లు రూపొందించామని ఆయన అన్నారు. మొత్తం రెండో దశలో 116.4 కిలోమీటర్లకు మార్గాన్ని నిర్మిస్తామ‌ని ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. 90 శాతం రైట్‌ ఆఫ్‌ వే ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధ‌న‌ల మేరకు అమలయ్యేలా ప్రాజెక్టు అనుమతులకు యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.

READ MORE  Hyderabad-Vijayawada | రెండు నెలల్లోనే హైదరాబాద్‌-‌విజయవాడ రహదారి విస్తరణ పనులు

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *