Saturday, August 30Thank you for visiting

Kolkatha | బంగ్లాదేశ్ రోగులు మా ఆస్పత్రికి రావొద్దు.. కోల్ కత్తా ఆస్పత్రి నిర్ణయం..

Spread the love

Kolkatha | బంగ్లాదేశ్‌లోని హిందువుల (Hindu minorities )పై దాడుల‌కు నిర‌స‌న‌గా అలాగే భారత జాతీయ ప‌తాకానికి చేస్తున్న అవ‌మానాల‌కు నిర‌స‌న‌గా ప‌శ్చిమ బెంగాల్ లోని ఓ ఆస్ప‌త్రి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఉత్తర కోల్‌కతాలోని మానిక్‌తలా ప్రాంతంలోని ఆసుపత్రి బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయడాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం నిరవధికంగా అమలులో ఉంటుందని జెఎన్ రే హాస్పిట‌ల్‌ అధికారి ప్రకటించారు. హాస్పిట‌ల్ ప్రతినిధి సుభ్రాంషు భక్త్ మాట్లాడుతూ, “మేము ఈ రోజు నుంచి బంగ్లాదేశ్ రోగిని చికిత్స కోసం చేర్చుకోమని నోటిఫికేషన్ జారీ చేశాం. ఎందుకంటే వారు భారతదేశం పట్ల అవ‌మానక‌రంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. అని తెలిపారు.

బంగ్లాదేశ్ వైఖ‌రిని నిరసనగా కోల్‌కతాలోని ఇతర ఆసుపత్రులు కూడా ఇదే వైఖరిని అవలంబించాలని భక్త్ పిలుపునిచ్చారు. ” బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం అందించేందుకు భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషించింది , అయినప్పటికీ వారు భారతదేశం ప‌ట్ల కృత‌జ్ఞ‌త లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. ఈ స్టాండ్‌లో ఇతరులు మాతో చేరతారని మేము ఆశిస్తున్నాము, ”అన్నారాయన.

దేశ జనాభాలో దాదాపు 8% ఉన్న బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులపై కొనసాగుతుతున్నాయి. హిందువుల‌పై దాడుల‌కు వ్య‌తిరేకంగా భార‌త్ అంత‌టా నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కోల్‌క‌త్తా ఆస్ప‌త్రి ఇటువంటి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆగస్టు 5న షేక్ హసీనా  అవామీ లీగ్ ప్రభుత్వం పతనం అయినప్పటి నుంచి 50 జిల్లాల్లో మైనారిటీ వర్గాలపై 200కు పైగా దాడులు జరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. హిందూ ఆధ్యాత్మిక వేత్త చిన్మోయ్ కృష్ణ దాస్‌ ( Chinmoy Krishna Das)  ను దేశద్రోహం కేసులో అరెస్టు చేసిన తర్వాత ఈ వారం పరిస్థితి మరింత దిగజారింది.

సువేందు అధికారి బంగ్లాదేశ్‌లో హింసకు గుర‌వుతున్న హిందువులకు శుక్రవారం, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్షనేత‌ నాయకుడు సంఘీభావం తెలిపారు. అసెంబ్లీ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారులు సామాజిక బహిష్కరణను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. “బంగ్లాదేశ్‌లో దాడుల‌కు గుర‌వుతు మైనారిటీలకు నైతిక మద్దతు ఇవ్వాలని నేను భారతీయులందరినీ, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ నివాసితులను కోరుతున్నాను. హిందువులపై దాడులు ఇటీవల‌ పెరిగాయి ”అని సువేందు అధికారి అన్నారు.
భారత జెండాను అగౌరవపరిచే చర్యలను ఖండిస్తున్నామ‌ని, వారికి ఆర్థిక ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని హెచ్చరించారు. “మన త్రివర్ణ పతాకం పవిత్రత చాలా ముఖ్యమైనది. ఇలాంటి ఘటనలు కొనసాగితే బంగ్లాదేశ్‌తో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోవచ్చు’ అని ఆయన అన్నారు.

 

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *