భారీ వర్షాలతో వణికిపోతున్న ఉత్తరభారతం
వర్ష బీభత్సంలో పలు రాష్ట్రాల్లో 37 మంది మృతి
ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా గత రెండు రోజుల్లో సుమారు 37 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత రెండు రోజులుగా వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 18 మంది చనిపోగా పంజాబ్, హర్యానాలో తొమ్మిది మంది, రాజస్థాన్‌లో ఏడుగురు, ఉత్తరప్రదేశ్‌లో ముగ్గురు మరణించారు.
ఢిల్లీలోని యమునా సహా పలు నదులు ఉప్పొంగుతున్నాయి. గత ఆదివారం రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలకు నగరాలు, పట్టణాల్లో పలు రహదారులు, నివాస ప్రాంతాలు
మోకాళ్ల లోతు నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షాలు, వరదల్లో చిక్కుపోయినవారిని రక్షించేందుకు మొత్తం 39 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలను నాలుగు ఉత్తర భారత రాష్ట్రాల్లో మోహరించారు. పంజాబ్‌లో 14 బృందాలు పనిచేస్తుండగా, హిమాచల్‌ప్రదేశ్‌లో 12, ఉత్తరాఖండ్‌లో
ఎనిమిది, హర్యానాలో ఐదు బృందాలను మోహరించారు.
జమ్మూలో, 7,000 మందికి పైగా యాత్రికులు చిక్కుకుపోయారు, ముఖ్యంగా భగవతినగర్ బేస్ క్యాంపులో, 5,000 మందికి పైగా రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్ బేస్
క్యాంపులో చిక్కుకున్నారు. అడ్మినిష్ట్రేషన్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) విభాగాలు నిరంతరం సమష్టి పనిచేస్తూ రహదారులను పునరుద్ధరిస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో సోమవారం లాహౌల్, స్పితిలోని చందర్తాల్, పాగల్ నల్లా ఇతర ప్రదేశాలలో 300 మందికి పైగా పర్యాటకులు, స్థానికులు చిక్కుకుపోయారు, అయితే జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDFR), పో లీసులు, హోంగార్డులు సంయుక్తంగా 515 మంది కార్మికులను మురికివాడల నుండి రక్షించారు. వరదల్లో గల్లంతైన 300 మందిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, వాతావరణం కుదుటపడినందున వారిని విమానంలో తరలించవచ్చని ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు తెలిపారు. కాగా పలు ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ఇది రూ.3,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు.
హిమాచల్ ప్రదేశ్ లో దాదాపు 800 రోడ్లు మూసుకుపోయాయి. హిమాచల్ రోడ్‌వేస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (హెచ్‌ఆర్‌టిసి) ప్రకారం.. 1,255 రూట్లలో బస్సు సర్వీసులు నిలిపివేశారు. 576 బస్సులు ఈ మార్గంలో వివిధ ప్రదేశాలలో నిలిచిపోయాయి. చండీగఢ్-మనాలి జాతీయ రహదారి కొండచరియలు విరిగిపడటం, పలుచోట్ల వరదల కారణంగా రవాణాకు అంతరాయం ఏర్పడింది. సిమ్లా-కిన్నౌర్ రహదారి కూడా స్లైడ్‌లు రాళ్లు పడిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
మంగళవారం ఉదయం వాతావరణ శాఖ రాష్ట్రంలోని 12 జిల్లాలకు గాను ఎనిమిది జిల్లాల్లో “అత్యంత భారీ వర్షాలు (204 మి.మీ. పైన) కురిసే అవకాశం ఉందని “రెడ్” అలర్ట్ జారీ చేసింది. మరోవైపు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన సిమ్లా-కల్కా మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
तस्वीरें डराने वाली हैं।
मंडी, हिमाचल प्रदेश#Rainfall #Himachal pic.twitter.com/t9QYWFrqNV— Versha Singh (@Vershasingh26) July 9, 2023