
Ayushman Card : రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స.. ఆయుష్మాన్ భారత్ కార్డుకు మీరు అర్హులేనా?
Ayushman Card : ఆయుష్మాన్ భారత్ యోజన (PMJAY) అనేది భారత ప్రభుత్వం అమలు చేస్తోన్న ఒక ప్రధాన ఆరోగ్య బీమా పథకం. దీని కింద రూ. 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. కానీ దీనికి కొన్ని షరతులు ఉంటాయి. ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి (BPLహోల్డర్లు) ఆరోగ్య బీమాను అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ పథకం ప్రయోజనం ఎవరు పొందుతారు? మీరు ఆయుష్మాన్ కార్డును ఎలా పొందవచ్చో ఈ పథకానికి సంబంధించిన అన్ని సమాచారాన్ని తెలుసుకోండి.ఆయుష్మాన్ కార్డు ను ఎవరు పొందవచ్చు?అసంఘటిత రంగంలో పనిచేసే వ్యక్తులు, నిమ్న ఆదాయ వర్గాలకు చెందిన వ్యక్తులు, 70 ఏళ్లు పైబడిన వారు, మరే ఇతర ఆరోగ్య పథకం నుంయి ప్రయోజనం పొందని వ్యక్తులు ఈ పథకానికి అర్హులు. ఆయుష్మాన్ భారత్ యోజన ప్రయోజనాలను పొందడానికి ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు.Ayushman Card: ఎవరికి వర్తించదు?ఈ పథకంలో, పన్ను చెల్లింపుదారులు, వ్యవస్థీకృత రంగంలో పనిచేసే వ్యక్...