- ఏబీవీపీ-ఎస్ఎల్వీడీ కూటమి సెంట్రల్ ప్యానెల్ మొత్తాన్ని కైవసం
- అధ్యక్షుడిగా శివ పాలెపు, ప్రధాన కార్యదర్శిగా శ్రుతి ప్రియ
- 81% ఓటింగ్ – ఎస్ఎఫ్ఐ, ఎన్‌ఎస్‌యూఐపై ఏబీవీపీ ఆధిపత్యం
HCU: ఢిల్లీ యూనివర్సిటీ తర్వాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో ”అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) ఘన విజయం సాధించింది. ఏబీవీపీ-ఎస్ఎల్వీడీ కూటమి అన్ని సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్ని కైవసం చేసుకుని సత్తా చాటింది. యూనియన్ అధ్యక్షుడిగా కూటమికి చెందిన శివ పాలెపు ఎన్నికయ్యారు. ఏబీవీపీ కూటమి నుంచి ప్రధాన కార్యదర్శిగా చెందిన శ్రుతి ప్రియ, సంయుక్త కార్యదర్శిగా సౌరభ్ శుక్లా గెలుపొందారు. వీనస్, జ్వాలా సాంస్కృతిక, క్రీడా కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో మొత్తం 81 శాతం కంటే ఎక్కవగా ఓటింగ్ నమోదైంది. ఎస్ఎఫ్ఐ, ఎన్‌ఎస్‌యూఐలపై ఏబీవీపీ సత్తా చాటింది.
ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం తరువాత, హెచ్‌సీయూలో సైతం ఏబీవీపీ కూటమి గెలుపొందడంపై బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా, రాహుల్ గాంధీని జెన్-జీ యువత తిరస్కరించిందని ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇటీవల, ఓట్ చోరీ ఆరోపణలపై రాహుల్ గాంధీ ”జెన్-జీ” పోరాడాలని పిలుపునిచ్చారు. అయితే, యువత మోదీ , బీజేపీ వెంట ఉందని వారు కామెంట్స్ చేస్తున్నారు.
కీలక ఆఫీస్ బేరర్ల కోసం మొత్తం 169 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది అధ్యక్ష పదవికి, ఐదుగురు ఉపాధ్యక్ష పదవికి, ఆరుగురు జనరల్ సెక్రటరీ పదవికి, ఐదుగురు జాయింట్ సెక్రటరీ పదవికి, నలుగురు సాంస్కృతిక మరియు క్రీడా కార్యదర్శి పదవులకు పోటీ పడ్డారు. ఓటర్ల సంఖ్య 81% కంటే ఎక్కువగా ఉంది. మీడియా నివేదికల ప్రకారం, సెప్టెంబర్ 19న 29 బూత్‌లలో పోలింగ్ నిర్వహించబడింది, 81 శాతానికి పైగా ఓటర్లు ఓటు వేశారు.