Group 1 Mains Exams: తెలంగాణలో సోమవారం నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరుగుతోంది. సోమవారం నుంచి ఈనెల 27 వరకు పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 563 పోస్టులకు 31, 382 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు మొదటి పరీక్ష జరగనుంది. గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థుల కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 46 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కాగా గ్రూప్ 1 అభ్యర్థులకు బయోమెట్రిక్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. కాగా జీవో 29 రద్దు చేయాలని అభ్యర్థుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. పరీక్ష పేపర్ల తరలింపులో తొలిసారి జీపీఎస్ ట్రాకింగ్ విధానాన్ని TSPSC వినియోగించనుంది .
గ్రూప్ 1 పరీక్షలపై నేడు సుప్రీమ్ కోర్టులో విచారణ
ఇదిలా ఉండగా గ్రూప్-1 పరీక్షను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించనుంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీవో29ను రద్దు చేయాలని ఈ నెల 17న ఓ అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థి తరఫున న్యాయవాది మోహిత్ రావు వెంటనే విచారణ జరపాలని ధర్మాసనాన్ని కోరారు. ఈ క్రమంలో సోమవారం విచారించనున్న కేసుల జాబితాలో తెలంగాణ గ్రూప్-1 అంశాన్ని కూడా చేర్చింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు