Gruha Jyothi Scheme | గృహ జ్యోతి పథకం కోసం కొత్త నిబంధనలు.. అర్హతలు ఇవే..
Gruha Jyothi Scheme | అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలు కల్పించేందుకు గృహలక్ష్మి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ (200 Units Of Free Current) పొందేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది. అన్నింటిలో మొదటిది.. తెల్ల రేషన్ కార్డులు కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అంతే కాకుండా తెలంగాణ విద్యుత్ శాఖ ద్వారా కరెంట్ మీటర్ నంబర్ తో ఆధార్ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. మరో నిబంధన.. లబ్ధిదారులు తమ రేషన్ కార్డులను ఆధార్ కార్డులతో అనుసంధానించాల్సి ఉంటుంది.
- గృహ జ్యోతి పథకం ఒక్క మీటర్ ఉన్న గృహాలకు మాత్రమే వర్తిస్తుంది.
- అద్దెదారులు, అద్దె వసతి గృహాల్లో నివసిస్తున్న వారు కూడా ఈ పథకానికి అర్హులే..
- మీ విద్యుత్ వినియోగం 200 యూనిట్ల కంటే ఎక్కువ ఉంటే ఈ పథకం వర్తించదని గమనించండి.
- కరెంటు బిల్లు బకాయిలు ఉన్నవారు లేదా గత రెండు నెలలుగా కరెంటు బిల్లు చెల్లించనివారు ఈ పథకానికి అర్హులు కారు.
- 2022-2023 సంవత్సరంలో గృహ వార్షిక విద్యుత్ వినియోగం 2,181 యూనిట్ల కంటే ఎక్కువ ఉండకూడదు.
అవసరమైన పత్రాలు
తెలంగాణ గృహ జ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్తు (Free Current) పొందడానికి, అప్లై చేసే సమయంలో, కింద ఇవ్వబడిన పత్రాలు అవసరమవుతాయి
- రేషన్ కార్డు
- విద్యుత్ బిల్లు
- ఆధార్ కార్డు
- మొబైల్ నెంబర్
Gruha Jyoti Scheme కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి ప్రభుత్వం ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని డిస్కమ్ లే క్షేత్రస్థాయిలో అమలు చేయనున్నట్లు తెలిపింది. డిస్కమ్‌లకు చెందిన సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలనకు వచ్చినపపుడు ఖచ్చితంగా ఆధార్ కార్డు చూపించాలని సూచించింది.
ఆధార్ కార్డుతోపాటు బయోమెట్రిక్‌ను తీసుకుంటారని, బయోమెట్రిక్ సక్రమంగా రాకుంటే.. ఐరిస్‌ను స్కాన్ చేస్తారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అదీ కూడా పని చేయని పరిస్థితుల్లో ఫొటో తీసుకుంటారని ఈ ప్రక్రియలు అన్నింటిలోనూ ఫెయిలైనా ఆందోళన చెందొద్దని పేర్కొంది. అన్ని ప్రయత్నాలు విఫలమైనపుడు లబ్ధిదారుడు ఆధార్ క్యూఆర్ కోడ్ సహాయంతో వివరాలు పొందుతారని ప్రభుత్వం వెలువరించిన ఉత్తర్వుల్లో వెల్లడించింది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..