తెలంగాణలోని రీజినల్ రింగ్ రోడ్డు (RRR project) ఉత్తర భాగాన్ని నిర్మించే ప్రక్రియను కేంద్రం (Central government) ప్రారంభించింది. Greenfield Express way గా నిర్మించేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఫోర్‌లేన్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేగా దీన్నినిర్మిస్తున్నారు. ప్రతిష్టాత్మక మౌలిక సౌకర్యాల ఈ ప్రాజెక్టును ఐదు ప్యాకేజీలుగా విభజించారు. రూ. 7,104.06 కోట్ల అంచనా వ్యయంతో ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ (Regional Ring Road) ) నిర్మాణాన్ని చేపడుతున్నారు. దీన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) పర్యవేక్షిస్తోంది.
161.518 కిలోమీటర్ల Greenfield Express way నిర్మాణం
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం సుమారు 161.518 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుంది. ఇది సంగారెడ్డి జిల్లా గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా టంగడపల్లి వరకు సాగుతుంది. దీని పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని కాంట్రాక్ట్ కంపెనీకి కేంద్రం గడువును విధించింది. నిర్మాణం అనంతరం కూడా ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఐదేళ్లపాటు నిర్వహించేం బాధ్యతను ఆ కంపెనీకే కట్టబెట్టింది.
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు కోసం కేంద్రం EPC (ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్) విధానాన్ని ఎంచుకుంది. దీని ద్వారా ప్రభుత్వ సహాయ నిధులను కూడా అందించే అవకాశం ఉంది.
NHAIకి DPR సమర్పణ
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (Greenfield Express way) ఉత్తర భాగానికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) గత నెలలో ఒక కన్సల్టెన్సీ సంస్థ ద్వారా NHAIకి అందించారు. ఇందులో వివిధ సిఫారసులు, సూచనలను పొందుపరిచారు. టెండర్ దరఖాస్తులను 2025 ఫిబ్రవరి 14 వరకు సమర్పించొచ్చు. బిడ్లను ఫిబ్రవరి 17న తెరవనున్నారు. ఆసక్తి కలిగిన వారు NHAI వెబ్‌సైట్ ద్వారా టెండర్ అప్లికేషన్లను పొందొచ్చు.
కాంట్రాక్టర్ అన్ని ఇంజనీరింగ్ పనులు, మెటీరియల్ ప్రొక్యూర్‌మెంట్, వ్యయాలు, నిర్మాణం నిర్వహించాల్సి ఉంటుంది.
భూసేకరణ ఇలా..
ప్రాజెక్టు కోసం మొత్తం 1,940 హెక్టార్ల భూమి అవసరం ఉండగా 94 శాతం సేకరణ ఇప్పటికే పూర్తయింది. ఈ రహదారి 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలను నడపడానికి అనుకూలంగా ఉండే విధంగా రూపకల్పన చేస్తున్నారు. మార్గమధ్యంలో 11 ఇంటర్‌చేంజ్‌లు, ఆరు విశ్రాంతి ప్రాంతాలు ఉంటాయి.
దక్షిణ భాగంపై నిరాసక్తత
ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగానికి DPR సిద్ధం చేయడంలో కన్సల్టెన్సీ సంస్థలు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో టెండర్ గడువును డిసెంబరు 16 నుంచి 27కి పొడిగించగా ఇటీవల టెండర్లు తెరిచినప్పుడు ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. దీంతో మరోసారి డిసెంబరు 30న మరోసారి టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రీ-బిడ్ మీటింగుల సమయంలో బిల్లుల ఆమోదంపై స్పష్టత లేకపోవడం, తగిన సమయం ఇవ్వకపోవడం వంటి సమస్యలు వెలుగుచూశాయి.
మంత్రి కోమటిరెడ్డి హర్షం
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం టెండర్ ప్రక్రియపై రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (State Roads and Buildings Minister Komatireddy Venkat Reddy) హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే ఈ ప్రాజెక్టుకు ఆమోదం పొందడం గొప్ప విజయమని పేర్కొన్నారు. అయితే.. 2017లో గత ప్రభుత్వం యుటిలిటీ చార్జీలను ముందే చెల్లించి ఉంటే ఈ రోజు మరింత పురోగతి సాధించే ఉండే వారమని అభిప్రాయపడ్డారు.
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేతో ప్రయోజనం
గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే అనేది పూర్తిగా కొత్తగా నిర్మించే రహదారి. ఇప్పటి వరకు ఉన్న దానిపై కాకుండా కొత్త భూమిపై దీని రూపకల్పన జరుగుతోంది. అధునాతన ప్రమాణాలతో ఈ రహదారులను నిర్మిస్తున్నారు. ఎక్కువ వేగంతో వాహనాల ప్రయాణానికి ఇవి అనువుగా ఉంటాయి. ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం, రెండు ప్రదేశాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం ఈ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం.
ఏ ప్రస్తుత మౌలిక సదుపాయంతో సంబంధం లేకుండానే నిర్మించడం ఈ గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల ప్రత్యేకత. ఈ రహదారులు సాధారణంగా నాలుగు లేదా ఆరుమార్గాలుగా ఉంటాయి. ఎక్కువ వేగానికి అనువుగా ఉంటాయి. వీటిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను వినియోగించి పటిష్టమైన నిర్మాణం, రోడ్డు భద్రత, నిర్వహణ సౌకర్యాలు కల్పిస్తారు. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి వనరులుగా కూడా దోహదపడతాయి. ఇవి దేశంలో రవాణా వ్యవస్థకు ముఖ్యమైన మార్పులను తీసుకొస్తూ వినియోగదారుల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరుస్తాయి. మౌలిక సదుపాయాల రంగంలో ఒక ప్రధాన దిశా సూచిగా ఈ రహదారులు పరిగణమిస్తాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..