
భారత్‌పై కొత్త కుట్ర? దీటుగా బదులిచ్చేందుకు త్రిశూల వ్యూహం
National Security issue | బంగ్లాదేశ్ తాత్కాలిక నేత ముహమ్మద్ యూనస్ ఇటీవల పాకిస్తాన్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌కు భారత ఈశాన్యం వక్రీకరించిన పటంతో కూడిన పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వడం వివాదానికి దారితీసింది. ఆ పటంలో అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపురతో పాటు పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు బంగ్లాదేశ్‌లో భాగాలుగా చూపించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది.
ఈ మ్యాప్ వెనుక ఉన్నది “గ్రేటర్ బంగ్లాదేశ్” సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్న ఇస్లామిస్ట్ గ్రూప్ సుల్తానత్-ఎ-బంగ్లా. భారత దేశ ఈశాన్య ప్రాంతాన్ని అస్థిరపరచడమే ఈ గ్రూప్ ఏకైకలక్ష్యం.
భారతదేశ చికెన్-నెక్‌పై బెదిరింపు
యూనస్ గతంలో చేసిన వ్యాఖ్యలూ భారతీయులను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. అతను చైనా పర్యటన సందర్భంగా సిలిగురి కారిడార్ (చికెన్ నెక్)పై వ్యాఖ్యానిస్తూ, ఈశాన్య రాష్ట్రాలు “భూపరివేష్టితమై ఉన్నాయి” అని వ్యాఖ్యానించాడు. ఈ 22 కిమీ వ్యూహాత్మక సిలుగురి కారిడార్ భారతదేశ ఈశాన్యాన్ని మిగతా దేశంతో కలిపే అత్యంత సున్నితమైన ప్రాణవాహిక లాంటిది. దీనికి ప్రతిస్పందనగా, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఈశాన్యం BIMSTEC ప్రాంతానికి “కనెక్టివిటీ హబ్” అని స్పష్టం చేశారు.
చిట్టగాంగ్ కారిడార్ & రంగ్‌పూర్ కారిడార్—బంగ్లాదేశ్ బలహీన లింకులు
చిట్టగాంగ్ కారిడార్ (30 కిమీ) –
బంగ్లాదేశ్ ప్రధాన భూభాగాన్ని చిట్టగాంగ్ పోర్టుతో కలిపే సన్నని భూభాగం.
ఇది మూసివేస్తే, బంగ్లాదేశ్ విదేశీ వాణిజ్యంలో 90% నిలిచిపోతుంది.
రంగ్‌పూర్ కారిడార్ (90 కిమీ) –
బంగ్లాదేశ్ అంతర్గతంగా కీలక లింక్. అస్సాం CM హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించినట్లు — “వారి చికెన్ నెక్ మనదాని కంటే చాలా బలహీనంగా ఉంది.”
చైనా వ్యూహం: లాల్మోనిర్‌హాట్ ఎయిర్‌బేస్‌పై కళ్లుపెట్టిన డ్రాగన్
చైనా లాల్మోనిర్‌హాట్ విమానాశ్రయంపై ప్రత్యేక ఆసక్తి చూపుతోంది. ఈ స్థలం సిలిగురి కారిడార్‌కు కేవలం 100 కిమీ దూరంలో ఉండటం వల్ల, అక్కడి నుంచి భారత సైనిక కదలికలను పర్యవేక్షించవచ్చు.
ఇది భారత భద్రతకు ప్రత్యక్ష ముప్పు కావొచ్చు.
భారత సైన్యం ‘త్రిశూలం సిద్ధం చేసింది:
ఈ పెరుగుతున్న జియో-పాలిటికల్ బెదిరింపులను ఎదుర్కోవడానికి భారత సైన్యం కీలక చర్యలు తీసుకుంది: ఇండియా సరిహద్దు ప్రాంతాల్లో మూడు కొత్త ఫార్వర్డ్ స్ట్రాంగ్ స్థావరాలు
లచిత్ బోర్ఫుకాన్ మిలిటరీ స్టేషన్ — ధుబ్రి, అస్సాం, ఫార్వర్డ్ ఆర్మీ బేస్ — కిషన్‌గంజ్, బీహార్, చోప్రా — పశ్చిమ బెంగాల్, ఈ స్థావరాలు నిఘాను పెంచి, శత్రువు ఏ కదలిక చేసినా వెంటనే గుర్తించేలా వ్యూహాత్మకంగా అమర్చబడ్డాయి. త్రి-శక్తి కార్ప్స్ (Sikkim–Siliguri రక్షణ బాధ్యత) ఇప్పటికే శక్తివంతమైన ఆయుధాలతో సిద్ధంగా ఉంది.
రాఫెల్ ఫైటర్ జెట్స్. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్, హషిమారాలో అడ్వాన్స్‌డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వంటివిఅందుబాటులో ఉన్నాయి. ఈ మోహరింపులు శత్రువులు ఏదైనా సాహసం చేయడానికి ముందు వంద సార్లు ఆలోచించేలా చేయనున్నాయి.
1971 తర్వాత మొదటిసారిగా పాకిస్తాన్ నేవీ షిప్ చిట్టగాంగ్ పోర్టును సందర్శించడం, అతడు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌తో సమావేశాలు జరపడం, ప్రాంతంలో కొత్త వ్యూహాత్మక మధ్యవర్తిత్వానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే ఏదైనా విపత్తు జరిగితే దీటుగా స్పందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. చైనా–పాకిస్తాన్–బంగ్లాదేశ్ ధోరణుల నడుమ, భారత సైన్యం తూర్పు సరిహద్దును బలోపేతం చేస్తూ,
ప్రతీ అడుగు, ప్రతీ కదలికను ముందుగానే అంచనా వేసి సన్నద్ధమవుతోంది.




