Posted in

Gold and Silver rates Today | మ‌ళ్లీ ఎగ‌బాకిన బంగారం, వెండి ధ‌ర‌లు.. 8ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. !

Today Gold Rates
Gold and Silver rates Today
Spread the love

Gold and Silver rates Today : బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ధరలు షాకిస్తున్నాయి. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీపావళికి ముందు రూ.80 వేల పైకి చేరిన బంగారం త‌ర్వాత క్రమంగా తగ్గుతూ వ‌చ్చింది. గత వారం రూ.76 వేల స్థాయికి పడిపోయింది. అయితే ఈ వారంలో మళ్లీ బంగారం ధరలు పెరిగి మళ్లీ రూ.80 వేల స్థాయికి చేరుకున్నాయి. కార్తీక మాసం దేశంలో వివాహాల‌ సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 24న ఉదయం వ‌ర‌కు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ((gold and silver rates today) ) రూ. రూ. 79, 640కి చేరింది.

ఢిల్లీలో 24 క్యారెట్ల పుత్త‌డి రేటు 10 గ్రాములకు రూ.79,790కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,150కి ఎగ‌బాకింది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 640కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ. 73, 000కి చేరింది. వెండి ధరలు కూడా మళ్లీ పెరుగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

  • హైదరాబాద్‌లో రూ. 79, 640, రూ. 73, 000
  • విజయవాడలో రూ. 79, 640, రూ. 73, 000
  • ఢిల్లీలో రూ. 79, 790, రూ. 73, 150
  • ముంబైలో రూ. 79, 640, రూ. 73, 000
  • కోల్‌కతాలో రూ. 79, 640, రూ. 73, 000
  • చెన్నైలో రూ. 79, 640, రూ. 73, 000
  • బెంగళూరులో రూ. 79, 640, రూ. 73, 000
  • కేరళలో రూ. 79, 640, రూ. 73, 000
  • పుణెలో రూ. 79, 640, రూ. 73, 000

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

  • హైదరాబాద్‌లో రూ. 1, 01, 000
  • విజయవాడలో రూ. 1, 01, 000
  • ఢిల్లీలో రూ. 92, 000
  • చెన్నైలో రూ. 1, 01, 000
  • కోల్‌కతాలో రూ. 92, 000
  • కేరళలో రూ. 1, 01, 000
  • ముంబైలో రూ. 92, 000
  • బెంగళూరులో రూ. 92, 000

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు వెనువెంట‌నే మారుతుంటాయి.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *