సేఫ్టీ టెస్ట్ లో ప్రముఖ కంపెనీల కార్లకు చెత్త ర్యాంకులు
పాపులర్ బ్రాండ్స్ అన్నీ వీక్..
న్యూఢిల్లీ: మధ్య తరగతి కుటుంబాలకు కారు ఒక కల. కష్టపడి సంపాదించిన డబ్బులను పోగేసి వారికి అందుబాటులో ఉన్న ధరలో కార్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే బడ్జెట్ పరిమితులను దృష్టి పెట్టుకొని చాలా మంది తక్కువ ధరలో వచ్చే కార్లను ఎంచుకోవడానికే ప్రాధాన్యమిస్తారు. అత్యంత కీలకమైన వాహనం మన్నిక సేఫ్టీ ఫీచర్లను అంతగా పట్టించుకోరు. కానీ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే పరిస్థితేంటీ అనేది కూడా ఆలోచించాలి. కార్ల దృఢత్వాన్ని పరిశీలించేందుకు గ్లోబల్ ఎన్ క్యాప్ వంటి సంస్థలు క్రాష్ టెస్ట్ లు నిర్వహించి వాటికి రేటింగ్ ఇస్తాయి.
మన దేశంలో కూడా భారత్ ఎన్ క్యాప్ (Bharat NCAP ) టెస్టింగ్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. కంపెనీలు స్వచ్ఛందంగా తమ కార్లను సెఫ్టీ టెస్టింగ్ కోసం ఇవ్వొచ్చు. ఇప్పటివరకు మన దేశానికి చెందిన వాహన కంపెనీలు ఉత్పత్తి చేస్తున్న కార్లను గ్లోబల్ ఎన్ క్యాప్ తోనే టెస్టింగ్ చేయిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటివరకు ఈ టెస్టింగ్ లో మారుతీ, హుండ్యాయ్ తో పాటు కొత్తగా వచ్చిన కియా కంపెనీకి చెందిన పలు బ్రాండ్స్ వెనుకబడి ఉన్నాయి.
మారుతీ సుజుకీకి చెందిన పాపులర్ బ్రాండ్స్ వ్యాగన్ ఆర్, స్విఫ్ట్, ఇగ్నిస్, ఎస్-ప్రెస్కో వంటి కార్లు గ్లోబల్ ఎన్ క్యాప్ టెస్ట్ లో విఫలమయ్యాయి. ఏజెన్సీలు ఇస్తున్న రేటింగ్స్ ఆయా కార్లు ఎంతవరకు భద్రత ఉందో వినియోగదారులు ఒక అంచనా వేసేందుకు టెస్ట్ ఉపయోగపడుతుంటాయి.
అయితే మారుతీ సుజుకీ అమ్మకాల్లో కీలకంగా ఉన్న వాగన్ ఆర్ క్రాష్ టెస్ట్ లో పిల్లల భద్రతో జీరో రేటింగ్ తెచ్చుకుంది. పెద్దల సెఫ్టీ టెస్ట్ లో కేవలం 1 స్టార్ పొందింది. ఈ కారు అందుబాటు ధరలో ఉండడం, ఆకట్టుకునే డిజైన్ వంటి కారణాలతో ఇది మారుతీ సుజుకీ కార్లలో అత్యధికంగా జరుపుతున్నవాటిలో ఒకటిగా నిలిచింది.మరో పాపులర్ కారు మారుతీ సుజుకీ కే10. ఈ కారుకు సెఫ్టీ టెస్ట్ లో 2 స్టార్లు మాత్రమే పొందింది. ఇది మారుతీ 800 ఎంట్రీ లెవల్ కారు. పిల్లల సిగ్మెంట్ లో ఈ కారుకు కూడా జీరో రేటింగ్ వచ్చింది. అత్యధిక అమ్మకాలు జరుపుతున్న స్విఫ్ట్ కొత్త వెర్షన్ లో అనేక భద్రత పరమైన ఫీచర్లను చేర్చినప్పటికీ గ్లోబల్ ఎన్ క్యాప్ టెస్ట్ లో కేవలం 2 స్టార్లు మాత్రమే పొందింది.
2023 Maruti Alto K10 crash test video – Global NCAP pic.twitter.com/wQggeXX46u
— RushLane (@rushlane) April 4, 2023
హ్యుందాయ్ ది కూడా..
Global Ncap test results హ్యుందాయ్ కంపెనీకి చెందిన మోస్ట్ పాపులర్ కారు గ్రాండ్ ఐ10 గ్లోబల్ ఎన్‌క్యాప్ టెస్ట్ లో కేవలం 2 స్టార్ రేటింగ్ మాత్రమే పొందింది.. పెద్దలు, పిల్లల సేఫ్టీలో ఈ కారు అతిపేలవమైన రేటింగ్ కలిగి ఉంది. ఈ కారు బాడీ నిర్మాణం స్థిరంగా లేదని గ్లోబల్ ఎన్ క్యాప్ పేర్కొంది. ఇదే కంపెనీకి చెందిన మరో పాపులర్ కారు హ్యుండాయ్ క్రిటా 3 స్టార్ రేటింగ్ సాధించింది.
కియా, రేనాల్ట్..
కియా ఇండియాకు చెందిన అత్యధికంగా అమ్మకాలు జరుపుతున్న సెల్టాస్ కు కూడా గ్లోబల్ ఎన్ క్యాప్ టెస్ట్ లో కేవలం 3 స్టార్ రేటింగ్ మాత్రమే వచ్చింది. పెద్దల ఆక్యుపెన్సీలో 8.03 పాయింట్లు, పిల్లల విభాగంలో 15 పాయింట్లు మాత్రమే తెచ్చుకుంది.మరో కంపెనీ రెనాల్ట్ కు చెందిన ఎంట్రీ లెవల్ కారు క్విడ్ కూడా కేవలం 1 స్టార్ రేటింగ్ మాత్రమే పొందిం ది. కారు ధర అందుబాటులో ఉండడంలో చిన్న కార్ల విభాగంలో ఇది బాగా పాపులర్ అయింది. పెద్దలు, పిల్లల విభాగంలో ఈ కారు కేవలం 1 స్టార్ రేటింగ్ మాత్రమే వచ్చింది.
ఈ కార్లు చాలా సేఫ్..
మంచి రేటింగ్ పొందిన వాటిలో టాటా మోటార్స్ కు చెందిన నెక్సాన్ ముందు వరుసలో ఉంది. ఈ కారు 5 స్టార్ రేటింగ్ వచ్చింది. అలాగే టాటా కంపెనీకే చెందిన ఆల్ట్రోజ్, పంచ్ కూడా 5 స్టార్ రేటింగ్ సాధించింది. వోక్సోవ్యాగన్ కు చెందిన వర్చుస్ గ్లోబల్ ఎన్ క్యాప్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ సాధించింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.