పీవోపీ ప్రతిమలు వద్దు.. మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం..
Ganesh Chaturthi-2023 : వినాయక చవితి పండుగ సమీపిస్తోంది. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతూ మండపాల ఏర్పాట్లలో నిర్వాహకులు బిజీ అయ్యారు. అయితే గణేష్ విగ్రహాన్ని కొనుగోలు చేసే ముందు అందరూ ఒక్కసారి ఆలోచించండి.. భవిష్కత్ తరాల కోసం పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాల (clay ganesha idol) నే కొనుగోలు చేయండి.. మట్టి వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా అనాదిగా వస్తున్న పురాతన సంప్రదాయాన్ని గౌరవించినవాళ్లం కూడా అవుతాం.
కొన్ని దశాబ్దాల క్రితం వినాయక విగ్రహాలను మట్టి (బంక మట్టి), గడ్డిని వంటి సహజమైన వనరులతో తయారు చేసేవారు. ఆ తర్వాత విగ్రహాన్ని పసుపు వంటి సహజ, సేంద్రియ రంగులతో అలంకరించేవారు కానీ కానీ ప్రస్తుతం POP (ప్లాస్టర్ ఆఫ్ పారిస్), థర్మకోల్, ప్లాస్టిక్ వంటి మట్టిలో కలిసిపోని, నీటిలో కరిగిపోని పదార్థాలతో విగ్రహాలను అత్యంత అందంగా రూపొందిస్తున్నారు. కంటికి ఇంపుగా జీవం ఉట్టిపడేలా పీవోపీ వినాయక విగ్రహాలు కనిపిస్తుండడంతో వినియోగదారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుండడంతో పర్యావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది.
విషం చిమ్ముతున్న పీవోపీ విగ్రహాలు
వినాయక విగ్రహాల తయారీలో సింథటిక్ కలర్స్, పీవోపీతో చేసిన గణేష్ విగ్రహాలు అత్యంత హానికరమైనవి. కొన్నేళ్లుగా భారీ ఎత్తులో ఉన్న వినాయకులకు డిమాండ్ పెరుగుతూ వస్తోంది. మొదట్లో ఆ విశ్వాసమే వినాయకుడికి మండపాలను ఏర్పాటు చేసేలా చేసింది. విగ్రహాల పరిమాణం విషయంలో పోటీ తత్వం పెరిగపోయింది. దీంతో గణేష్ విగ్రహాల మార్కెట్ పెద్ద వ్యాపారంగా మారింది. శిల్పులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో విగ్రహాలనే ఎక్కువగా తయారు చేస్తారు. ఎందుకంటే అది చౌకగా, తేలికగా, సులభంగా అచ్చు లు వేసి తయారుచేసే వెసులుబాటు ఉంటుంది.
PoP (ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్) తో తయారు చేసిన విగ్రహాలు చౌకగా, తేలికగా ఉంటాయి. సింథటిక్ మెటాలిక్ రంగులతో అలంకరించబడినప్పుడు అవి ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కానీ, ఇక్కడ ఆందోళన కలిగించే విషయమేమిటంటే.. POP నీటిలో తేలికగా కరగదు. నిమజ్జనం తర్వాత విగ్రహాలు నీటిపై తేలుయాడుతాయి. ఇందులో వాడే రంగుల్లో కాడ్మియం, మెర్క్యూరీ వంటి హానికరమైన భారమైన లోహాలు ఉంటాయి. కాడ్మియం ఒక ప్రమాదకరమైన లోహం. ఇది మానవుల ఊపిరితిత్తులు, మూత్రపిండాలు మూత్రపిండ వైఫల్యానికి దారి తీస్తుంది. ఎముకలు బలహీనమై పెలుసుగా చేస్తుంది. ఇక మెర్క్యురీ కూడా తక్కువది కాదు. ఇది అనేక హానికరమైన చర్మ వ్యాధులకు కారణమవుతుంది. మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అవి నీటి కాలుష్యాన్ని కలిగిస్తాయి మానవ జీవితానికి అత్యంత ప్రమాదకరం. హానికరమైన కెమికల్స్ కారణంగా చెరువులు, కుంటల్లో చేపలు, రొయ్యలు ఇతర జలచరాలు చనిపోతాయి. విషతుల్యమైన చేపలు తినడం వల్ల మానవుల్లో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
నరాలపై ప్రభావం
పీవోపీ వినాయకుడి విగ్రహానికి అలంకరించే రంగుల్లో ఎక్కువగా మెర్క్యురీ, లెడ్ ఉంటుంది. ఇవి నరాల వ్యవస్థపై, పిల్లలు, గర్భిణులపై దుష్ర్పభావం చూపిస్తాయి. కాబట్టి కలర్ ఫుల్ గాకనిపించే వినాయక విగ్రహానికి బదులుగా మట్టి గణపతిని కొనుగోలు చేయడం మంచింది.
మట్టి విగ్రహాలే మేలు..
మట్టితో తయారు చేసిన గణేష్ విగ్రహాల((clay ganpati))ను పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఇవి మన పూజలు, నైవేద్యాలకు, భక్తికి విలువను ఇస్తుంది. చిన్న విగ్రహాలను ఉపయోగించవచ్చు. మన భక్తి , విశ్వాసాలు గొప్పగా ఉన్నంత వరకు ఇది పర్వాలేదు. కానీ భక్తి పేరుతో ప్రకృతి మాతను కలుషితం చేయడాన్ని దేవుడు కూడా మెచ్చుకోడు. విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని సహజమైన, సేంద్రియ రంగులతో అలంకరిద్దాం. ఇకపై మనం మట్టి విగ్రహాలను మాత్రమే నీటిలో నిమజ్జనం చేయాలి. POP, ఇతర హానికరమైన రసాయనాల వంటి ప్రమాదకర పదార్థాలతో చేసిన విగ్రహాల జోలికి ఏమాత్రం వెళ్లొద్దు.
- మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయి.. ఎందుకంటే అవి మట్టితోనే తయారవుతాయి. ఇది పర్యావరణానికి అత్యంత అనుకూలమైనది. అలాగే నీటి కాలుష్యానికి ఏమాత్రం కారణం కాదు.
- మట్టితో చేసిన విగ్రహాలకు ఎలాంటి రంగులు, రంగులు ఉపయోగించరు.
- మట్టి విగ్రహాలకు కృత్రిమ అలంకరణలు, అదనపు ఇనుప చువ్వలు అవసరం లేదు.
- మట్టితో చేసిన విగ్రహాలు తక్కువ ఎత్తులో వస్తాయి కాబట్టి రవాణా సమయంలో ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగవు.
- మట్టి విగ్రహాలు భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మికతకు ప్రతీక.
- గణేశ చతుర్థి పండుగ విశిష్టతను POPకి తిరస్కరించడం ద్వారా ఈ పండుగ గొప్పదనాన్ని కాపాడుకుందాం.
- నిమజ్జనం కూడా చాలా సింపుల్.. ఒక బకెట్ నీటిని తీసుకొని దానిలో మట్టి గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేయవచ్చు. మీరు దానిని మొక్కలకు నీరు పెట్టడానికి ఉపయోగించవచ్చు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.
One thought on “పీవోపీ ప్రతిమలు వద్దు.. మట్టి వినాయక విగ్రహాలనే పూజిద్దాం..”