Saturday, April 19Welcome to Vandebhaarath

Freebies Politics | పురుషులను వెంటాడుతున్న ఉచిత ప‌థ‌కాలు.. కొత్త ఛార్జీలతో జేబుల‌కు చిల్లు

Spread the love

Freebies Politics | గత కొన్ని సంవత్సరాలుగా ఉచిత ప‌థ‌కాలు రాజ‌కీయాల‌ను శాసిస్తున్నాయి. తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ ఇలా చాలా రాష్ట్రాల్లో ఎక్కువ‌గా ఉచిత ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయి. రాజకీయ పార్టీలకు ఎన్నికలలో విజయం సాధించడంలో ఇవే సహాయపడ్డాయి. ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్ర‌యాణం, మహిళలు , విద్యార్థులకు నెలవారీ ఆర్థిక సాయం.. ఇలా రాజకీయ పార్టీలు రాష్ట్ర ఖ‌జానాను ఆర్థిక ప‌రిస్థితుల‌ను ఏమీ ప‌ట్టించుకోకుండా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఒకదాని తర్వాత మరొకటి ఉచిత‌ పథకాలు ప్రవేశపెడుతూనే ఉన్నాయి.

అయితే, ఈ ఉచిత‌ పథకాల భారం ఖజానాపై ( financial burden) పడుతుంది. దాదాపు అన్ని రాష్ట్రాలు ఇంత భారీ అదనపు ఆర్థిక భారాన్ని భరించడానికి సిద్ధంగా లేవు. ఇప్ప‌టికే తెలంగాణ‌, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తీవ్ర‌మైన‌ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీంతో సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతూ.. రాష్ట్ర‌ ఆదాయాన్ని పెంచుకోవ‌డానికి ఏదో ఒక మార్గం వెతుకుతున్నాయి.

READ MORE  Sandeshkhali row : 'మమతను అరెస్టు చేయాలి.. టిఎంసిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి.. బిజెపి నేత‌ డిమాండ్

ఈ నేప‌థ్యంలో ఆదాయం పెంపున‌కు ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణ‌యాలు పురుషుల జేబుల‌కు గండిపెడుతున్నాయి. తాజాగా పురుషుల‌కు ఉచిత పబ్లిక్ టాయిలెట్లను రద్దు చేయాలని హిమాచల్ ప్రదేశ్ నిర్ణయించింది. మ‌రోవైపు కర్ణాటక బస్ట్ ఛార్జీలను 15% పెంచాలని నిర్ణయించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసిన కర్ణాటకలో మహిళలకు బస్సులు ఉచితం.. కాబట్టి, బస్సుల్లో ప్రయాణించడానికి పురుషులు ఇక‌పై ఎక్కువ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించే పురుషులకు రూ.5 రుసుము విధించాలని సిమ్లా మునిసిపల్ కార్పొరేషన్ ఇటీవ‌లే నిర్ణయించింది. ఉచితాలతో పాటు సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం ఖర్చులు భరించలేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు స్వయంగా ఉచిత విద్యుత్‌ను వదులుకున్నారు. రాష్ట్ర ఆర్థిక భారాన్ని తగ్గించడానికి సంపన్న కుటుంబాలు కూడా స‌హ‌క‌రించాల‌ని కోరారు.

READ MORE  Valmiki corporation scam | వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం.. కాంగ్రెస్ మంత్రి రాజీనామా

క‌ర్ణాట‌క‌లో బ‌స్సు చార్జీల పెంపు

 Increase the bus fares : ఇప్పుడు, కాంగ్రెస్ (Congress) అధికారంలో ఉన్న కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వ యాజమాన్యంలోని రవాణా కార్పొరేషన్లలో బస్సు ఛార్జీలను 15 శాతం పెంచాలని నిర్ణయించింది. ఇంధన ధరలు, సిబ్బందిపై వ్యయం పెరగడం వంటి నిర్వహణ ఖర్చులు భారీగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ తెలిపారు. ఈ చార్జీల పెంపుతో నెలవారీ రూ.74.85 కోట్లు, ఏటా రూ.784 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.

READ MORE  'సీఎం గారూ.. ఆర్టీసీ బస్సుల్లో డబ్బులు పెట్టి నిలబడి ప్రయాణించాలా..?

Freebies Politics అయితే మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప‌థ‌కం కొనసాగుతుందని మంత్రి స్ప‌ష్టం చేశారు. కర్ణాటక మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్యంలోని నాన్-లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ‘శక్తి’ పథకానికి ( ‘Shakti’ guarantee)రూ.5,015 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు. మ‌రోవైపు దిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ (AAP)పార్టీ కూడా మహిళా ఓటర్లకు ఉచిత ఆర్థిక సహాయంతో సహా అనేక ఉచితాలను అందిస్తోంది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *